హీరో విక్రమ్‌పై నిందలు మోపిన బాలీవుడ్ డైరెక్టర్.. కౌంటర్ ఇచ్చిన చియాన్

by Vinod kumar |   ( Updated:2023-05-22 13:00:25.0  )
హీరో విక్రమ్‌పై నిందలు మోపిన బాలీవుడ్ డైరెక్టర్.. కౌంటర్ ఇచ్చిన చియాన్
X

దిశ, సినిమా: అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రాబోతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘కెన్నెడీ’ ఫిల్మ్ ప్రస్తుతం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడుతోంది. ఈ క్రమంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కథను చియాన్ విక్రమ్‌ను దృష్టిలో ఉంచుకుని రాసినట్లు తెలిపాడు అనురాగ్. కానీ తనను ఎన్ని సార్లు సంప్రదించేందుకు ట్రై చేసినా కలవలేదని చెప్పుకొచ్చాడు. కాగా దీనిపై స్పందించిన చియాన్.. ‘డియర్ అనురాగ్ కశ్యప్.. ఏడాది క్రితం జరిగిన కన్వర్జేషన్‌ను మన ఫ్రెండ్స్, వెల్ విషర్స్ గురించి మళ్లీ ప్రారంభిస్తున్నా. మీరు నా గురించి ట్రై చేస్తున్నారని వేరొక నటుడి ద్వారా తెలుసుకుని వెంటనే మిమ్మల్ని కాంటాక్ట్ చేశాను.

మీ నుంచి మెయిల్, మెసేజ్ రాలేదని వివరించాను. మీరు నన్ను సంప్రదించిన ఐడి ఇప్పుడు యాక్టివ్‌గా లేదు. దాదాపు రెండు సంవత్సరాల క్రితం నా నంబర్ మారిపోయింది. ఆ ఫోన్ కాల్ సమయంలో నేను చెప్పినట్లు, మీ కెన్నెడీ సినిమా కోసం నేను చాలా ఎగ్జైట్‌గా ఉన్నాను. బోలెడంత ప్రేమతో చియాన్ విక్రమ్ అకా కెన్నెడీ’ అని పోస్టులో రాసుకొచ్చాడు.

Read More: 550 సార్లు రీరిలీజైన ఏకైక ఇండియన్ సినిమా..

ఎన్టీఆర్ పుట్టినరోజున ప్రణతి ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..

ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటుడు అనుమానస్పద మృతి

Advertisement

Next Story