Kalyan Dev : చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ పోస్ట్ వైరల్!

by Prasanna |
Kalyan Dev : చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ పోస్ట్ వైరల్!
X

దిశ, సినిమా: మెగా డాటర్ శ్రీజ రెండో భర్త కళ్యాణ్ దేవ్ గురించి పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం వీరిద్దరు కలిసి ఉండటం లేదని, డివోర్స్ తీసుకున్నారంటూ ఆన్‌లైన్ వేదిక‌పై పెద్దఎత్తున వార్తలు వస్తున్నాయి. అయినప్పటికీ ఈ రూమర్స్‌పై మెగా ఫ్యామిలీ మాత్రం ఎలాంటి రియాక్ట్ అవ్వడం లేదు. అయితే తాజాగా కళ్యాణ్‌ దేవ్ పెట్టిన పోస్ట్ చూస్తుంటే.. పరోక్షంగా తాను ఎందుకు దూరంగా ఉంటున్నాడో చెప్పకనే చెప్పినట్టు అనిపిస్తుంది. ఈ పోస్ట్ లో 'ఎదుటి వాళ్లు మనల్ని ఎంతగా ఇష్టపడుతున్నారనేది ముఖ్యం కాదు. వాళ్లు మనల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారనేది ముఖ్యం' అంటూ కళ్యాణ్‌ దేవ్ ఓ కొటేషన్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంటే కళ్యాణ్ దేవ్‌కు మెగాస్టార్ ఇంట్లో ఏదైనా అవమానం జరిగిందా? అందుకే శ్రీజతో విడిపోయాడా? అంటూ జనాలు చర్చిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed