మహేష్ బాబుకు అలాంటి సజెషన్ ఇచ్చిన చరణ్, తారక్.. కోపంలో నమ్రత ఏమన్నారో తెలుసా?

by Anjali |   ( Updated:2023-11-16 07:49:23.0  )
మహేష్ బాబుకు అలాంటి సజెషన్ ఇచ్చిన చరణ్, తారక్.. కోపంలో నమ్రత ఏమన్నారో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: రీసెంట్‌గా పవర్ స్టార్ రామ్ చరణ్.. దీపావళి పండుగ సందర్భంగా టాలీవుడ్ హీరోలను ఆహ్వానించి గ్రాండ్‌గా పార్టీ చేసుకొన్న విషయం తెలిసిందే. ఈ వేడుకకు విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ విచ్చేశారు. వీరు సందడి చేసిన పిక్స్‌ను కూడా సోషల్ మీడియాలో తమ ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. అయితే ఈ పార్టీలో సరదాగా మాట్లాడుకున్న తారక్, బన్నీ, చరణ్, మహేష్‌కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. చరణ్, ఎన్టీఆర్.. మహేష్, బన్నీకి ఓ సజెషన్స్ ఇచ్చారట. ‘‘మహేష్ నువ్వు రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నావ్ జాగ్రత్త. చెప్పిన దాని కంటే రెండు ఏళ్లు ఎక్కువగా టైం తీసుకుంటాడు అంటూ ఫన్నీగా రాజమౌళి గురించి మాట్లాడుకున్నారట. అంతేకాదు అప్పటిలా డైటింగ్‌లు చేస్తే జక్కన్నతో కుదరదు. కడుపునిండా తిండి తినాలి. ఎప్పుడు ఎనర్జిటిక్‌గా ఉండాలి. రాజమౌళి ఒక్కొక్క దానికి 10–15 టేకులు తీసుకుంటాడు జాగ్రత్త మహేష్ అంటూ చాలా సరదాగా తారక్, చరణ్.. మహేష్‌ బాబుతో అన్నారట.

ఇక పక్కనే ఉన్న నమ్రత శిరోద్కర్ వీళ్ళ ఫన్నీ కాన్వర్జేషన్ విని సైలెంట్‌గా ఉందట. ఇంటికి వెళ్ళాక మహేష్‌ బాబుకు బ్రెయిన్ వాష్ చేసి.. వారు అలా సరదాగా చెప్పారు. నువ్వు ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని రాజమౌళి ప్రాజెక్టు విషయంలో భయపడకు. ఎక్కువగా ఆలోచించకు అని ధైర్యం చెప్పిందట. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ కావడంతో ‘నమ్రతకు కోపం వచ్చినట్లుంది. చరణ్, తారక్‌.. సూపర్‌స్టార్‌ను డిస్కరేజ్ చేసినట్లు మాట్లాడితే.. అందుకే మహేష్‌ను ఇంటికి తీసుకెళ్లి నమ్రత క్లాస్ ఇచ్చినట్లుంది, అయినా ఈ హీరోలకు హిట్లు ఇచ్చే డైరెక్టర్ గురించి అలా మాట్లాడటం కరెక్ట్ కాదు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియదు కానీ ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది.

Advertisement

Next Story