సనాతన ధర్మంలో ఇలాంటి పనులు చేయొచ్చా? నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన యాంకర్ రష్మీ

by Anjali |   ( Updated:2023-09-12 08:35:02.0  )
సనాతన ధర్మంలో ఇలాంటి పనులు చేయొచ్చా? నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన యాంకర్ రష్మీ
X

దిశ, వెబ్‌డెస్క్: హీరో ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన కామెంట్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈయన చేసిన వ్యాఖ్యలు కొంతమంది యాక్సెప్ట్ చేయగా.. హిందూ వర్గాలు మాత్రం తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఏకంగా ఉదయనిధిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ సనాతన ధర్మానికి సపోర్ట్ చేసి మాట్లాడారు. దీంతో సనాతన ధర్మం వ్యతిరేకుల నుంచి ఈమెకు ప్రశ్నలు, కౌంటర్లు ఎదురయ్యాయి. ఓ నెటిజన్ రష్మీ హాట్ ఫొటో జోడించి.. ‘సనాతన ధర్మంలో దీనికి చోటు ఉందా? అంగీకరిస్తారా?’ అని ప్రశ్నించాడు. దీంతో రష్మీ మండిపడుతూ.. ‘వాదన గెలవలేనప్పుడు, వాళ్ళ దగ్గర పాయింట్ లేనప్పుడు ఇలాంటి చెత్త ప్రశ్నలతో దిగుతారని ఆమె అన్నారు. నాతో డైరెక్ట్‌గా వాదించలేని వాళ్ళు ఇలాంటి పిక్స్ పెట్టి, సంబంధం లేని ప్రశ్నలు అడుగుతున్నారని కౌంటర్ వేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌ అవుతోంది.



Advertisement

Next Story