BREAKING: కన్నడ సినీ ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం.. హీరో దర్శన్‌ మేనేజర్ బలవన్మరణం

by Shiva |
BREAKING: కన్నడ సినీ ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం.. హీరో దర్శన్‌ మేనేజర్ బలవన్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ నటుడు దర్శన్ హత్య కేసులో అరెస్ట్ అవ్వడం కన్నడ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. తన ప్రియురాలు పవిత్రపై అసభ్యకరమైన కామెంట్లు చేస్తూ మేసేజ్‌లు పెట్టిన రేణుకా స్వామి అనే అభిమానిని అత్యంత కిరాతకంగా చంపిన కేసులో పోలీసులు హీరో దర్శన్ అదుపులోకి తీసుకున్నారు. అయితే, కేసులో పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుండగానే కన్నడ ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హీరో దర్శన్ మేనేజన్ ఫాంహౌజ్‌లో ఉరేసుకుని ఆత్మహత్యు పాల్పడ్డాడు. మృతదేహంతో పాటు ఓ సూసైడ్ నోట్ కూడా దొరికినట్లుగా పోలీసులు తెలిపారు. అయితే, అందులో తన హీరో దర్శన్‌ను అరెస్ట్ చేయడం తనను బాధించిందని మృతుడు పేర్కొన్నాడు. ఆయన అరెస్ట్ అయిన నాటి నుంచి ఒంటరిగా ఫీల్ అవుతూ.. మానసికంగా ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మేనేజర్ సూసైడ్ నోట్‌లో వివరించినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే రేణుకా స్వామి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న దర్శన్‌కు ఆయన మేనేజర్ ఆత్మహత్య మరింత చిక్కుల్లో పడేస్తుందా వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed