గుడ్‌ న్యూస్‌ చెప్పిన బాలీవుడ్‌ స్టార్‌ జంట

by Kavitha |   ( Updated:2024-02-09 07:52:37.0  )
గుడ్‌ న్యూస్‌ చెప్పిన బాలీవుడ్‌ స్టార్‌ జంట
X

దిశ, సినిమా: బాలీవుడ్ క్యూట్ కపుల్స్ లో రిచా చద్దా – అలీ ఫజ‌ల్ జంట ఒకటి. నటీనటులుగా వారికంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వీరు ఇప్పుడు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక కెరిర్ విషయం పక్కన పెడితే దాదాపు నాలుగేళ్లపాటు డేటింగ్‌ లో ఉన్న ఈ జంట అక్టోబర్‌ 2022లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా పెళ్లైన ఏడాదిన్నరకు తమ అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పారు. తాము త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న మంటూ ప్రకటించింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతుండటంతో ఇది చూసిన నెటిజన్లు రిచా ఫజల్‌ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


Advertisement

Next Story