సాంప్రదాయంగా శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ బ్యూటీ

by GSrikanth |   ( Updated:2024-01-05 07:14:57.0  )
సాంప్రదాయంగా శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ బ్యూటీ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ నటి జాన్వీ కపూర్ తిరుమలలో పర్యటించారు. శుక్రవారం ఉదయం సాంప్రదాయ వస్త్రాల్లో శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నటి మహేశ్వరితో కలిసి ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుమల అధికారులు వారికి ఘన స్వాగతం పలిశారు. అంతరం ప్రత్యేక దర్శనానికి ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కాగా, ప్రస్తుతం జాన్వీ యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న ‘దేవర’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్‌లో విడుదల కానుంది.



Advertisement

Next Story

Most Viewed