- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆసక్తి లేనివారు బయటకు వెళ్లిపోండి.. 'బిగ్‌బాస్' సీరియస్
దిశ, సినిమా: 'బిగ్ బాస్' తెలుగు 6వ సీజన్ జోరుగా సాగుతోంది. మొన్నటి వారం బ్యాటరీ ఛార్జ్ ప్రక్రియ ద్వారా ఇంటి సభ్యులను ఎమోషనల్‌గా ఆడుకున్న బిగ్ బాస్.. మళ్లీ నామినేషన్ల పేరిట పెద్ద చిచ్చు పెట్టాడు. కాగా తాజా ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో ప్రకారం ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో భాగంగా సెలెబ్రిటీ గేమ్ కండక్ట్ చేసారు. ఈ టాస్క్ కోసం ఇంటి సభ్యులు బిగ్ బాస్ డిసైడ్ చేసిన హీరో, హీరోయిన్ సినిమా గెటప్స్ వేయాలి. ఈ క్రమంలో రోహిత్ బాహుబలి ప్రభాస్ లాగా, గీతూ పుష్ప శ్రీవల్లి, ఆదిరెడ్డి పుష్పరాజ్, మెరీనా అనుష్క దేవసేన, శ్రీహాన్ బాలయ్య, రాజశేఖర్ ప్రభాస్, రేవంత్ చిరంజీవి ఇలా స్టార్ హీరోలు, హీరోయిన్స్ గెటప్ వేయడం జరిగింది. కంటెస్టెంట్స్ వేసిన గెటప్స్‌లో ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయాలి. అయితే ఈ టాస్క్ అనుకున్నట్లుగా సాగలేదు. వారికి టాస్క్ పట్ల పెద్దగా ఆసక్తి ఉన్నట్లు కనిపించలేదు. దీంతో కోపంతో రగిలిపోయిన బిగ్ బాస్ 'గేమ్ పట్ల ఆసక్తి లేనివారు మెయిన్ డోర్ నుండి నేరుగా ఇంటికి వెళ్లిపోవచ్చు' అంటూ వార్నింగ్ ఇచ్చాడు. అయితే బిగ్ బాస్ చెప్పినట్లే మెయిన్ డోర్ ఓపెన్ కావడంతో కంటెస్టెంట్స్ ఒక్క సారిగా షాక్ తిన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.