డైరెక్టర్‌తో రెండేళ్లు డేటింగ్‌.. ఆ నొప్పి తట్టుకోలేక బ్రేకప్ చెప్పిన మోడల్

by Prasanna |   ( Updated:2023-07-21 07:46:07.0  )
డైరెక్టర్‌తో రెండేళ్లు డేటింగ్‌.. ఆ నొప్పి తట్టుకోలేక బ్రేకప్ చెప్పిన మోడల్
X

దిశ, సినిమా: ప్రముఖ అమెరికన్ మోడల్ బెల్లా హడిడ్, ఆర్ట్ డైరెక్టర్ మార్క్ కల్మాన్ తమ అభిమానులకు షాక్ ఇచ్చారు. 2021లో పీకల్లోతూ ప్రేమలో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించిన జోడి.. తమ రెండేళ్ల బంధానికి ఇటీవల స్వస్తి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సన్నిహితుల సమాచారం ప్రకారం.. ‘ఇంతకాలం వారిద్దరూ చాలా ప్రేమలో ఉన్నారు. కానీ రెండేళ్లకే వారి సంబంధం ముంగింపు దశకు చేరుకుంది. గత రెండు మూడు నెలలుగా ఒకరిపట్ల ఒకరు ప్రతికూల మార్గంలో పయనిస్తున్నారు. వీడిపోయినా విషయాన్ని కూడా సామరస్యంగానే ఉంచాలనుకుంటున్నారు’ అని పలు నివేదికలు వెల్లడించాయి. ఇక ఇటీవల దంతాల సమస్యతో దవడ, ముఖం వాపు, విపరీతమైన నొప్పి, మైగ్రేన్ వంటి పలు అనారోగ్య సమస్యలు తన రూపాన్ని ప్రభావితం చేశాయన్న హడిడ్.. అందుకే అద్దంలో చూసుకోవడం, తనను తాను ఫొటోలు తీసుకోవడం పట్ల్ విసుగు చెందినట్లు తెలిపింది.

Advertisement

Next Story