- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bandla Ganesh వర్సెస్ Vijay Devarakonda.. అసలేం జరుగుతోంది?
దిశ, డైనమిక్ బ్యూరో: టాలీవుడ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ మరోసారి హీరో విజయ్ దేవరకొండను టార్గెట్ చేశారు. ఈ సారి విజయ్ దేవరకొండ తన తండ్రితో దిగిన ఫోటోను తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ క్లాస్ పీకాడు. ఈ ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో కానీ ఇటీవల కాలంలో విజయ్ ఏది మాట్లాడిన దానికి బండ్ల గణేష్ కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. తాజాగా తన తండ్రితో కూర్చుని ఉన్న ఫోటోను విజయ్ దేవరకొండ ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. బ్యూటీఫుల్ వెదర్ అంట్ డాడ్ టేకింగ్ హిస్ యూజ్ వల్ క్లాస్ అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చాడు. ఈ ఫోటోల్లో విజయ్ దేవరకొండ తన తండ్రి ఎదుటే కాలు టేబుల్ పై ఉంచాడు. విజయ్ షేర్ చేసిన ఈ ఫోటోలపై బండ్ల రియాక్ట్ అయ్యారు. విజయ్ దేవరకొండ ఫోటోకు తన తండ్రికి ట్రిమ్మర్ తో హెయిర్ ట్రిమ్ చేస్తూన్న ఫోటోను జోడిస్తూ..'మనకి ఈ ప్రపంచాన్ని చూసి అదృష్టాన్ని కల్పించిన మన తల్లిదండ్రులు మన దైవాలు వారిని ప్రేమించటం పూజించటం మన ధర్మం' అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్ పై దీవ్ర దుమారం చెలరేగింది. విజయ్ ను ప్రతి సారి కార్నర్ చేస్తున్నాడని బండ్లపై కొంత మంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే విజయ్ ప్రవర్తన సరికాదంటూ మరి కొంత మంది కౌంటర్ ఇస్తున్నారు. ఇలా తన ట్వీట్ పై దుమారం చెలరేగడంతో మరోసారి బండ్ల గణేష్ రియాక్ట్ అయ్యారు. 'ప్రతి దాన్ని తప్పుగా అర్థం చేసుకోకండి నేను చెప్పింది ప్రేమతోనే' అంటూ తన ట్వీట్ పై వివరణ ఇస్తూ మరో ట్వీట్ చేశారు. ఈ వ్యవహారం ఇద్ధరి ఫ్యాన్స్ మద్ద మరింత అగ్గిరాజేసినట్టైంది. దీంతో ఇంటర్నెట్ లో ఇరువురి ఫ్యాన్స్ రెండుగా చీలిపోయిన విమర్శలు గుప్పించుకుంటున్నారు. కాగా లైగర్ సినిమా ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ లో నెపొటిజం గురించి ఇన్ డైరెక్ట్ గా దేవరకొండ చేసిన కామెంట్స్ కు బండ్ల గణేష్ అంతే పరోక్షంగా కౌంటర్ ఇవ్వడం అప్పట్లో టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎటువంటి నేపథ్యం లేకపోయినా అభిమానులు తనను ప్రేమిస్తున్నారని విజయ్ చేసిన కామెంట్స్ కు.. 'తాతలు తండ్రులు ఉంటే సరిపోదు టాలెంట్ కూడా ఉండాలి. ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్ ల మాదిరిగా టాలెంట్ ఉండాలి. గుర్తుపెట్టుకో బ్రదర్ అంటూ బండ్ల కౌంటర్ ఇచ్చారు. ఈ ఇష్యూను మర్చిపోకముందే ఈ ఇద్దరి మధ్య తాజాగా తండ్రి విషయంలో చెలరేగిన దుమారం ఎంత దూరం వెళ్తుందో చూడాలి మరి.
Read more:
వాయిలెట్ సూట్లో వేడెక్కిస్తున్న Sreemukhi.. ఎద అందాలు చూపిస్తూ..