‘తంగలాన్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో‌ సుమకు స్టేజీపైనే ముద్దు పెట్టిన నటుడు

by Anjali |
‘తంగలాన్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో‌ సుమకు స్టేజీపైనే ముద్దు పెట్టిన నటుడు
X

దిశ, సినిమా: హీరో విక్రమ్ నటించిన తాజా చిత్రం ‘తంగలాన్’. అణగారిన వర్గాల పట్ల జరిగే వివక్షను ప్రశ్నించే నేపథ్యంలో తెరకెక్కె ఈ చిత్రానికి రంజిత్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన విక్రమ్ ఫస్ట్ లుక్ అండ్ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆగస్టు 15 వ తేదీన తంగలాన్ థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అవ్వనుంది. ఈ క్రమంలో నిన్న హైదరాబాదులో ప్రీరిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖ యాంకర్ సుమ యాంకర్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా సుమ పలువురి నటీనటులను వేదికపైకి పిలిచి సరదాగా ఆటపట్టించింది.

ఈ క్రమంలో నటుడు డెనియల్‌ను స్టేజీకి పిలిచి మాట్లాడింది. తెలుగులో డెనియల్‌‌తో ‘తంగలాన్ మూవీని తప్పకుండా అందరూ చూడండి. అలాగే ఇక్కడ అందర్లో సుమనే చాలా అందంగా ఉంది’ అని కామెడీగా మాట్లాడించింది. తర్వాత సుమకు థాంక్యూ చెబుతూ వేదికపైనే షాక్ ఇచ్చాడు. థాంక్యూ సుమ అంటూ వెంటనే ఆమె హ్యాండ్‌కు కిస్ పెట్టాడు. దీంతో సుమ ఒక్కసారిగా షాక్ అయింది. తర్వాత రాజా డెనియల్ మా అన్నయ్య అని చెబుతుంది. త్వరలోనే రాఖీ పండుగ వస్తుందని, అన్నయ్య సన్నిధి అంటూ సాంగ్ పాడి సరదాగా తీసుకుంటుంది.

Advertisement

Next Story

Most Viewed