అనుష్క షెట్టి లుక్స్ పై ట్రోల్స్

by Javid Pasha |   ( Updated:2023-02-26 03:09:25.0  )
అనుష్క షెట్టి లుక్స్ పై ట్రోల్స్
X

దిశ, వెబ్ డెస్క్: సినీ స్టార్స్, పొలిటీషియన్స్, క్రీడాకారులు, ఇతర సెలెబ్రిటీలు ఈ మధ్య బాగా ట్రోలింగ్ కు గురవుతున్నారు. నెటిజన్లు తమ అయిష్టతను, కోపాన్ని ట్రోలింగ్ రూపంలో చూపెడుతున్నారు. దీంతో తమపై ఎప్పుడూ ఏ ట్రోలింగ్ వైరల్ అవుతుందోననే భయంతో సెలెబ్రిటీలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా బాహుబలి నటి అనుష్క షెట్టి ట్రోలింగ్ కు గురైంది. అనుష్క బాగా లావైందంటూ ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి. శివరాత్రి సందర్భంగా ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి బెంగళూరులోని ఓ దేవాలయానికి అనుష్క హాజరైంది. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు నెట్టింట్ల వైరల్ గా మారాయి. ఆ వీడియోలో అనుష్క కాస్త బొద్దుగా కనిపించింది.

అనుష్కకు సంబంధించిన తాజా లుక్స్ పై ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోలో ఆమెను చూసి కొంతమంది ఫ్యాన్స్ సంతోషడితే.. మరి కొంతమంది మాత్రం ఆమెను కించపరిచేలా ట్రోల్ చేస్తున్నారు. అనుష్క ఇంత లావుగా ఉంటుందని అనుకోలేదని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. అనుష్కను అలా చూసి తన ఆశలు ఆవిరయ్యాయి అంటూ మరో వ్యక్తి ట్వీట్ చేశాడు. ''చాలా బాధగా ఉంది. త్వరగా స్లిమ్ అవ్వు స్వీటీ'' అంటూ ఇంకో వ్యక్తి కామెంట్ చేశాడు. ఇలా రకరకాలుగా అనుష్క పై ట్రోలర్స్ బాడీ షేమింగ్ కు పాల్పడుతున్నారు.

గతంలో కూడా చాలా మంది హీరోయిన్లు బాడీ షేమింగ్ కు గురయ్యారు. ఇటీవల ఓ ప్రైవేట్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ.. 90వ దశకంలో తనను థండర్ థైస్ అంటూ పిలిచేవారని రవీనా టాండన్ వాపోయింది. తన అప్పీరియన్స్ పై సోషల్ మీడియాలో అసభ్యంగా మాట్లాడారని సెలెనా గోమ్స్ తెలిపింది. లూపస్ వ్యాధికి మెడిసిన్ వాడటం వల్ల తాను లావయ్యానని ఆమె చెప్పుకొచ్చింది. దివ్యాంక త్రిపాఠి, అమృతా అరోరా కూడా గతేడాది ఫ్యాట్ షేమింగ్ కు గురయ్యారు. విద్యాబాలన్ కూడా బాడీ షేమింగ్ కు గురైంది.

Advertisement

Next Story

Most Viewed