‘అశ్విన్స్’.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన అనిరుధ్..

by Vinod kumar |   ( Updated:2023-03-12 17:31:27.0  )
‘అశ్విన్స్’.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన అనిరుధ్..
X

దిశ, సినిమా: శ్రీ వెంక‌టేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బాపినీడు. బి సమర్పణలో బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం ‘అశ్విన్స్’. త‌రుణ్ తేజ‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సైక‌లాజిక‌ల్ హార‌ర్ థ్రిల్లర్ నుంచి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయించారు మేకర్స్. ఇక వ‌సంత్ ర‌వి, విమ‌లా రామ‌న్, ముర‌ళీధ‌ర‌న్‌, సార‌స్ మీన‌న్‌, ఉద‌య దీప్‌, సిమ్రాన్ ప‌రీక్‌ ప్రధానపాత్రలు పోషిస్తున్న చిత్రంలో ‘చీక‌టి ప్రపంచం నుంచి మాన‌వుల‌కు చెడును చేసే 1500 ఏళ్ల నాటి శాపం. దీని కార‌ణంగా అమాయ‌కులైన కొంత మంది యూ ట్యూబ‌ర్స్ బ‌ల‌మైపోతుంటారు. అయితే చివరికి మానవులు దీన్ని ఎలా ఎదుర్కొన్నారు? ఆ సమస్యనుంచి ఎలా బయటపడ్డారనేది ఆసక్తికరంగా తెరకెక్కించాం’ అని మేకర్స్ తెలిపారు. విజ‌య్ సిద్ధార్థ్‌ సంగీతం అందిస్తున్నాడు.

Also Read...

‘#సూర్య 42’ అదిరిపోయే అప్‌డేట్.. టైటిల్ గ్లింప్స్ ఎప్పుడంటే?

Advertisement

Next Story