ఐశ్యర్య ప్రెగ్నెన్సీపై ట్రోలింగ్.. అబ్బాయిలు ఎదగట్లేదట

by Anjali |
ఐశ్యర్య ప్రెగ్నెన్సీపై ట్రోలింగ్.. అబ్బాయిలు ఎదగట్లేదట
X

దిశ, సినిమా: కొత్తగా పెళ్లైన మహిళలు ఒక షో లేదా సినిమా నుంచి తప్పుకుంటే గర్భవతి అయినట్లు కాదంటోంది ఐశ్వర్య శర్మ. ఇటీవల తాను ‘ఘుమ్ హై కిసికే ప్యార్ మే’ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో భారీ ఎత్తున్న ప్రెగ్నెంట్ రూమర్స్ రావడంతో ఆశ్చర్యపోయానని చెప్పింది. అయితే పుకార్లతో తానేమీ ఇబ్బంది పడలేదు కానీ తల్లి గర్భంపై ట్రోలింగ్‌ను ఊహించలేదని, ఇలాంటి సంఘటనలు మహిళలను మానసికంగా దెబ్బతీస్తాయని ఆవేదన వ్యక్తం చేసింది. ‘పెళ్లి తర్వాత ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటే గర్భం దాల్చినట్లేనా? కాస్త ఎదగండి అబ్బాయిలు’ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇక 2021లో నటుడు నీల్ భట్‌ను మ్యారేజ్ చేసుకున్న ఐశ్యర్య.. ప్రస్తుతం ‘ఖత్రోన్ కే ఖిలాడీ 13’లో పాల్గొనబోతున్నట్లు తెలిపింది.


Advertisement

Next Story

Most Viewed