Aishwarya Rai-Abhishek: మరోసారి ట్రెండింగ్‌లో ఐశ్వర్య రాయ్- అభిషేక్.. విడాకులపై క్లారిటీ ఇచ్చేసిందిగా అంటున్న నెటిజన్లు!

by Hamsa |   ( Updated:2025-03-04 15:28:37.0  )
Aishwarya Rai-Abhishek: మరోసారి ట్రెండింగ్‌లో ఐశ్వర్య రాయ్- అభిషేక్.. విడాకులపై క్లారిటీ ఇచ్చేసిందిగా అంటున్న నెటిజన్లు!
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్(Aishwarya Rai) ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి ఇండస్ట్రీకి ఊపేసింది. దాదాపు ఐదు భాషల్లో నటించిన ఆమె తన అందంతోనే ఎంతోమంది అభిమానులు సంపాదించుకుంది. తెలుగులో ‘జీన్స్’సినిమాలో నటించిన ఐశు ‘రోబో’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఒక పొన్నియన్ సెల్వన్-1, పీఎస్-2 వంటి మూవీస్‌తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను ఫిదా అయ్యేలా చేసింది. ఇక 2023 చివరగా నటించిన ఆమె ఎలాంటి కొత్త సినిమా ప్రకటించలేదు. ఇక ఐశ్వర్య పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ కొడుకు అభిషేక్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఆరాధ్య అనే కూతురు కూడా ఉంది.

అయితే గత కొద్ది రోజుల నుంచి అభిషేక్(Abhishek Bachchan), ఐశ్వర్య రాయ్ మధ్య మనస్పర్థలు తలెత్తుతుండటంతో విడాకులు తీసుకోవడానికి డిసైడ్ అయినట్లు పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ ఇప్పటికీ వరకు ఆమె స్పందించి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఇప్పటికీ వీరి డైవర్స్‌కు సంబంధించిన వార్తలు ఎన్నో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్ బాలీవుడ్ డైరెక్టర్ అశుతోష్ గోవారికర్(Ashutosh Gowariker) కుమారుడి పెళ్లికి హాజరయ్యారు. చాలా రోజుల తర్వాత జంటగా కనిపించి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ప్రస్తుతం ఈ స్టార్ కపుల్‌కు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక కొందరు మాత్రం ఐశ్వర్య రైఫన్ అనే ఖాతాలో పెట్టిన పోస్ట్‌తో విడాకుల వార్తల వేళ ఈ పెళ్లికి హాజరై ఫుల్ క్లారిటీ ఇచ్చిందని కామెంట్లు చేస్తున్నారు.



Next Story

Most Viewed