మెగా ఫ్యామిలీతో వివాదం.. క్లారిటీ ఇచ్చిన కమెడియన్ పృథ్వీరాజ్

by Javid Pasha |   ( Updated:2023-10-10 15:32:26.0  )
మెగా ఫ్యామిలీతో వివాదం.. క్లారిటీ ఇచ్చిన కమెడియన్ పృథ్వీరాజ్
X

దిశ, వెబ్ డెస్క్: నటుడు పృథ్వీరాజ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ’ అంటే చాలు టక్కున ఆయనే గుర్తొస్తారు. ఖడ్గం మూవీలో ఆయన చెప్పిన ఈ డైలాగ్ ప్రేక్షకులకు అంతలా రీచ్ అయింది మరి. ఇక పృథ్వీరాజ్ ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు. అనంతరం రాజకీయాల్లో చేరి వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ చానెల్ కు చైర్మన్ గా వ్యవహరించాడు. అయితే అనంతరం చోటుచేసుకున్న పరిణామాల క్రమంలో ఆ పదవీకి రాజీనామా చేసి వైసీపీ నుంచి బయటకు వచ్చాడు. అయితే ఆయన వైసీపీలో ఉన్న సమయంలో మెగా ఫ్యామిలీపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాగా తాజాగా దిశ టీవీ ఇంటర్వ్యూలో మెగా ఫ్యామిలీతో జరిగిన గొడవ, అనంతరం జరిగిన పరిణామాల గురించి పృథ్వీరాజ్ షేర్ చేసుకున్నారు.

Advertisement

Next Story