హీరోలతో పడకగది సన్నివేశాల గురించి.. నిజాలు బయటపెట్టిన స్టార్ హీరోయిన్..!

by Kavitha |   ( Updated:2024-01-17 07:30:27.0  )
హీరోలతో పడకగది సన్నివేశాల గురించి.. నిజాలు బయటపెట్టిన స్టార్ హీరోయిన్..!
X

దిశ, సినిమా: టాలెంటెడ్ హీరోయిన్ అంజలి గురించి పరిచయం అక్కర్లేదు.తన అందం నటనతో ఇటు తమిళ, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈ అమ్మడు ఈ మధ్య ఎక్కువగా తమిళ సినిమాల్లో నటిస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అంజలి కొన్ని బోల్డ్ కామెంట్స్ చేసింది.

నటి మాట్లాడుతూ.. ‘సినిమాల్లో ముద్దు సన్నివేశాలు, పడకగది సన్నివేశాలు సహజంగా తీస్తారు. కథ కు అవసరమైనప్పుడు కచ్చితంగా అందులో నటించాల్సి ఉంటుంది కాదనలేము. కానీ హీరోలతో ఆ తరహా సన్నివేశాలు నటించేటప్పుడు ఎలాంటి వారికైనా కాస్త ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే అలాంటి బోల్డ్ సీన్స్ షూట్ చేసేటప్పుడు చుట్టూ జనం, టెక్నీషియన్లు మిగతా నటీనటులు కూడా ఉంటారు. వారందరూ నా గురించి లోపల ఏం మాట్లాడుకుంటారని భయం ఉంటుంది.. ఎందుకంటే ఇద్దరు ప్రేమికుల మధ్య కెమిస్ట్రీ చాలా భిన్నంగా ఉంటుంది. హీరోలతో కిస్సింగ్ బెడ్ రూమ్ సన్నివేశాలో సహజంగా నటించాలి. అందుకే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది’ అని తెలిపింది. ప్రజంట్ ఈ నటి మాటలు వైరల్ అవుతున్నాయి.


Advertisement

Next Story

Most Viewed