లక్షలు ఇచ్చినా ఆ షోలో నటించనంటున్న స్టార్ కమెడియన్..!

by Anjali |   ( Updated:2023-08-17 08:24:23.0  )
లక్షలు ఇచ్చినా ఆ షోలో నటించనంటున్న స్టార్ కమెడియన్..!
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ కమెడియన్ జోష్ రవి గురించి ప్రత్యేకంగా పరిచయం లేదు. ఎన్నో చిత్రాల్లో నటించి ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘సినీ పరిశ్రమలో చిరంజీవి, రవితేజ అంటే నాకు ఎంతో గౌరవం. చాగంటి ఇంట్లో పెళ్లి జరుగుతున్నప్పుడు భరణితో కలిసి వెళ్లాను. చాగంటి పక్కన నేను నిలబడ్డాను. ఆయన ప్రవచనాలను నేను బాగా ఫాలో అవుతాను. అలాగే అలీతో మంచి బాండింగ్ ఉంది. ఆయన నేను కలిసి మూడు, నాలుగు దేశాలు కూడా తిరిగాము. సినిమాల్లో యాక్టర్‌గా సక్సెస్ అయితేనే మనీ వస్తాయి. కాబట్టి నేను సినిమాలే చేయాలని ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు రూ. 2 లక్షలు ఇస్తామన్నా కూడా నేను జబర్దస్త్‌కు వెళ్ళను. ఆ షో నుంచి బయటకు వచ్చాక 4 సార్లు గెస్ట్‌గా వెళ్లాను.’’ అని జోష్ రవి చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story