- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అర్జున్ సర్కార్.. హిట్-3 కోసం సరికొత్త అవతార్‌లో నాని
దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని.. వైవిధ్యమైన కథాంశాలను, విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం 'సరిపోదా శనివారం' చిత్రీకరణ ముగించుకున్న హీరో.. ప్రజెంట్ తన తదుపరి ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సరిపోదా శనివారం’ ఆగస్టు 29న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా తరువాత నాని తన సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాలో 'హిట్-3' చిత్రంలో నటించబోతున్నారు. ఇంతకు ముందు రూపొందిన హిట్, హిట్-2 చిత్రాలు మంచి విజయాలు సాధించిన సంగతి తెలిసిందే.
ఈ ఫ్రాంచైజీలో తెరకెక్కనున్న చిత్రమే హిట్-3. అంచనాలను అందుకునే విధంగా ఈ చిత్రం కథను రెడీ చేస్తున్నారు దర్శకుడు శైలేష్ కొలను. అయితే ఈ మూవీ కథలో కూడా నేచురల్ స్టార్ ఇన్‌వాల్వ్ అయ్యాడని తెలిసింది. ఈ సినిమా స్టోరీ లైన్ కోసం దర్శకుడు నాని ఇచ్చిన ఐడియాను తీసుకున్నాడట. పూర్తి కథ కూడా సిద్ధం కావడంతో సెప్టెంబర్‌లో చిత్రీకరణ ప్రారంభించే ఆలోచనలో ఉన్నారట. ఈ సినిమాలో నాని అర్జున్ సర్కార్ అనే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.
Read more...