‘35 చిన్న కథ కాదు టీజర్ రిలీజ్.. యాక్టింగ్ అదరగొట్టిన నివేదా థామస్

by Hamsa |   ( Updated:2024-07-03 15:59:33.0  )
‘35 చిన్న కథ కాదు టీజర్ రిలీజ్.. యాక్టింగ్ అదరగొట్టిన నివేదా థామస్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ నివేదా థామస్ గత కొద్ది కాలంగా సినిమాలకు దూరం అయింది. ఇటీవల గుడ్ న్యూస్ చెబుతాను అని పోస్ట్ పెట్టడంతో పెళ్ళికి సంబంధించిన వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న నివేద తన సినిమా ప్రకటనను విడుదల చేసింది. దీంతో పెళ్లి వార్తలకు చెక్ పడినట్లు అయింది. ప్రస్తుతం ఈ అమ్మడు నందకిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘35 చిన్న కథ కాదు’ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది. ఇందులో ప్రియదర్శి, విశ్వ కీలక పాత్రలో కనిపించనున్నారు.

దీనికి రానా దగ్గుబాటి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకోగా.. తాజాగా, 35 చిన్న కథ కాదు టీజర్ విడుదల చేశారు మేకర్స్. ఇందులో మధ్య తరగతి గృహిణి పాత్రలో కనిపించిన నివేదా థామస్ అందరి హృదయాలను గెలుచుకుంది. కొడుకు చదువులో వెనుక పడటంతో తనలాగా ఫెయిల్ కాకూడదని పాస్ చేయించే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే ఆ బాబు ఇంట్లో నుంచి పారిపోతాడు. ఇక ఈ సమయంలో నివేద చెప్పిన ఎమోషనల్ డైలాగ్స్ అందరినీ కన్నీరు పెట్టిస్తున్నాయి. ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఆగస్ట్ 15న గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Read More..

మధ్యతరగతి గృహిణిల మారిపోయిన నివేదా థామస్.. లుక్ వైరల్

Advertisement

Next Story