- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
2500 KG బియ్యంతో.. ఎకరం పొలంలో సోనూ సూద్ రూపం(వీడియో వైరల్)
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ సోనూ సూద్ గురించి పరిచయం అక్కర్లేదు. దేశవ్యాప్తంగా ఆయనకు ఎంతో మంది అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నో సినిమాల్లో విలన్‌గా మెప్పించి..నిజ జీవితంలో మాత్రం రియల్ హీరోగా నిలిచాడు. కరోనా సమయంలో దుర్భర పరిస్థితులను ఎదురుకొన్న చాలా మందికి సహాయం అందించిన ఈ హీరో ఇప్పటికీ నిరుపేదలకు ఆయన సాయం చేస్తూనే ఉన్నాడు.
పేదలకు ఆర్థిక సాయం, చిన్నారులకు గుండె సంబంధిత ఆపరేషన్లు చేయిస్తూనే ఉన్నారు. కాగా.. కరోనా నుంచి ఆయన సాయం అందుకున్న వారు ఏదో రూపంగా ఆయనపై అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ నటుడి సేవాగుణానికి ప్రతి రాష్ట్రంలో అభిమాన సంఘాలు కూడా ఏర్పాటాయ్యాయి. ఆయనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సెలబ్రేట్ చేస్తూనే ఉంటున్నారు.
అయితే తాజాగా... మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో గల తుకోజీరావు పవార్ స్టేడియంలో సోనూసూద్ రూపాన్ని తీర్చిదిద్దారు. ఏకంగా ఎకరం పొలంలో ప్లాస్టిక్ షీట్‌ను నేలపై పరిచి 2500 కేజీల బియ్యంతో సోనూసూద్ ముఖాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఓ అద్భుతమైన వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై సోనూసూద్ స్పందించి... వారి ప్రేమకు, స్వచ్ఛమైన అభిమానికి ధన్యవాదాలు తెలిపారు.