పవర్ స్టార్‌కు ప్రముఖుల విషెస్..

దిశ, వెబ్‌డెస్క్ :

జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్ 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది. ఇప్పటికే మెగా అభిమానులు ఆయన బర్త్ డేను పండుగలా జరుపుకుంటున్నారు. సామాజిక మాద్యమాల్లో ఎక్కడా చూసిన పవన్ ‘బర్త్ డే’ వాల్ పోస్టర్స్ విపరీతంగా ట్రోల్స్ అవుతున్నాయి. తాజాగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా పవన్ పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలిపారు.

వారిలో తెలంగాణ గవర్నర్ తమిళి సై, నారా లోకేష్, కోన వెంకట్, హీరో నితిన్, సమంత, బీవీఎస్‌ఎన్ ప్రసాద్, రామజోగయ్య శాస్త్రీ, రామ్ ఆచంట, రామ్ తాళ్లూరి, వెన్నెల కిశోర్, సంపత్ నంది, గోపిమోహన్, నిర్మాత డీవీవీ దానయ్య తదితరులు ఉన్నారు.

Advertisement