- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
అత్యాధునిక ఫీచర్లతో మోటోరోలా న్యూ ఫోన్స్
దిశ, వెబ్‌డెస్క్: మోటోరోలా మళ్లీ తన హవా కొనసాగించడానికి ప్లాన్ చేస్తోంది. రెడ్ మీ, షియోమీ, ఒప్పొ కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధం అయింది. దీనిలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో పాగావేసే దిశగా బడ్జెట్ ఫోన్ల తయారీపై ఫోకస్ చేసింది. తాజాగా భారత మార్కెట్లోకి రెండు కొత్త మోడల్స్ ను విడుదల చేసింది. ఈ రెండు మోడల్స్ ను అత్యాధునిక స్పెసిఫికేషన్లతో తయారు చేస్తున్నట్లు తెలిపింది. దేశంలో తమ మార్కెట్ ను మరింత పెంచుకునేందుకు.. కస్టమర్లకు కావాల్సిన ఫీచర్లతో వీటిని తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. మోటోరోలా జీ సిరీస్ నుంచి రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు రాబోతున్నాయి. మోటో జి 60, మోటో జి 40 ఫ్యూజన్ పేర్లతో వీటిని భారత మార్కెట్ లోకి తీసుకురాబోతున్నారు.
మిడ్ రేంజ్ లో రానున్న జీ 60, జీ 40 స్మార్ట్ ఫోన్లు స్నాప్ డ్రాగన్ 732 జి చిప్‌సెట్ ప్రాసెసర్ తో పనిచేస్తాయని దీనిలో 108 మెగాపిక్సెల్తో కూడిన ప్రైమరీ సెన్సార్ కెమెరాను అందించనున్నట్లు తెలుస్తోంది. 6000mAh బ్యాటరీతో, ఫాస్ట్ చార్జింగ్ తో రానుంది. సింపుల్ గా చెప్పాలంటే రెడ్‌మీ నోట్ 10 ప్రో మాక్స్, రియల్‌మీ 8 ప్రోకి పోటీగా మోటోరోలా జీ 60, జీ 40 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్లను తీసుకురానున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం మిడ్ రేంజ్ మొబైల్ మార్కెట్లో షియోమీ, రియల్ మీ వంటి సంస్థలు అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి.