- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అక్రమాలపై ప్రశ్నించినందుకే నాపై ‘అవిశ్వాసం’..

దిశ, చిగురుమామిడి : ఉమ్మడి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ముదిమాణిక్యం గ్రామపంచాయతీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై పలుమార్లు తాను ప్రశ్నించినందుకే, వార్డు సభ్యులతో కలిసి సర్పంచ్ జక్కుల రవీందర్ కుట్రపూరితంగా అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేశారని ఉపసర్పంచ్ బోయిని లావణ్య శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ముదిమాణిక్యం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉపసర్పంచ్ మాట్లాడుతూ.. దళితులు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగవద్దనే లక్ష్యంతో వార్డు సభ్యులతో కలిసి సర్పంచ్ జక్కుల రవీందర్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.
ముదిమాణిక్యం గ్రామ శివారులోని వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ప్రశ్నించినందుకు తనపై అవిశ్వాస తీర్మానం పెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల ఓట్లను ఓటు బ్యాంకుగా చేసుకుని ఎంపీటీసీగా, సర్పంచ్ గా గెలుపొంది, ఇప్పుడు దళితులను విస్మరించడం తగదని అంబేద్కర్ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో అంబేడ్కర్ సంఘం అధ్యక్షుడు జేరుపోతుల వెంకటస్వామి, బోయిని రాజయ్య, శ్రీనివాస్, కట్ల రాజు తదితరులు పాల్గొన్నారు.