- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అడవిలో కాల్పులు.. ఒణికిపోయిన తల్లులు
దిశ, వెబ్‌డెస్క్ :
ఫ్లాష్.. ఫ్లాష్.. బీజాపూర్‌లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు.. ఓ మహిళా మావోయిస్ట్.. 22 మంది పోలీసులు మృతి..
టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. అది చూసిన ఓ బాలుడు పరుగున పక్కింటికి వచ్చి ‘‘దండకారణ్యంలో ఎన్ కౌంటర్ జరిగింది… పోలీసులే ఎక్కువ మంది చనిపోయారు’’ అని ఇంటి బయట పని చేసుకుంటున్న మహిళకు చెప్పాడు..
ఉలిక్కి పడిన ఆమె.. అప్పటి నుంచి మూడు రోజులపాటు కొడుకు జాడ కోసం టీవీకే అతుక్కుపోయింది. నిద్రాహారాలు మాని.. టీవీలో చూపించే ప్రతి దృశ్యాన్నీ చూస్తోంది. ఎన్ కౌంటర్ అయిన ప్రాంతంలో తిరుగుతున్న పోలీసుల్లో తన కొడుకు ఆచూకీ కోసం వెతికింది. ఆమెకు తోడుగా భర్త కోసం భార్య.. తండ్రి కోసం నాలుగేళ్ల చిన్నారి కళ్లల్లో ఒత్తులు వేసుకుని టీవీ ఎదుటే కూలబడిపోయారు.
సోమవారం ఉదయం తెలిసింది ఓ పిడుగులాంటి వార్త… అప్పటి వరకు ఉన్న చిన్న ఆశను తుంచేస్తూ.. ‘‘మీ కుమారుడు వీర మరణం పొందాడు. దండకారణ్యంలో జరిగిన పోరాటంలో నేలకొరిగాడు’’ అంటూ పోలీసుల నుంచి కబురు వచ్చింది. ఆ విషాద వార్తతో శోకసంద్రంలో మునిగిపోయింది ఆ కుటుంబం.
ఇది ఈ ఒక్క తల్లి గర్భ శోకం మాత్రమే కాదు. ఉద్యోగ నిర్వహణలో తూటాలకు ఎదురెళ్లే ప్రతి పోలీస్ తల్లిది. ప్రజల కోసం ఉన్న ఊరుని, కన్న వారిని వదులుకుని పోరుబాట పట్టిన మావోయిస్టుల మాతృమూర్తులది కూడా. ఎక్కడ ఎన్ కౌంటర్ జరిగినా మొదట వణికేది ఆ తల్లుల గుండెలే. తమ వారి కోసం ఆతృతగా ఎదురు చూసేది వారి కన్నీటి కళ్లే.
శనివారం ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ దండకారణ్యంలో జరిగిన భారీ ఎన్ కౌంటర్‌లో కాంకెర్ జిల్లా పండరీపానీ గ్రామానికి చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ చీఫ్ కానిస్టేబుల్ రమేశ్ కుమార్ జుర్రీ మృతిచెందాడు. రమేశ్ తండ్రి మేఘనాథ్ ప్రభుత్వ ఉద్యోగి. ఆయన మృతి చెందారు. ఆ తర్వాత తల్లి, తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్ల బాధ్యతలను రమేశే చూసేవాడు. ఆ గ్రామంలో పోలీసు ఉద్యోగం చేసే ఇద్దరు పోలీసులు.. మావోయిస్టులతో జరిగిన పోరాటంలోనే అశువులు బాశారు. వారికి గ్రామస్తులు విగ్రహాలు ఏర్పాటు చేశారు. రమేశ్ ఇంటికి సమీపంలోనే ఓ పోలీస్ అధికారి విగ్రహం ఉన్నది. ఆ విగ్రహాన్ని చూసినప్పుడల్లా తను పోలీస్ కావాలని కలలు కనేవాడు రమేశ్. కానీ ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. చివరికి అందరినీ ఒప్పించి 2010లో మొదటి ప్రయత్నంలోనే కానిస్టేబుల్ అయ్యారు. 2015లో సునీతతో వివాహం జరిగింది. వారికి నాలుగేళ్ల సెజల్ అనే కూతురు ఉంది.
రమేశ్ భౌతిక కాయానికి జగ్ధల్ పూర్ లో పోలీసు అధికారులు, మంత్రులు గౌరవ వందనం సమర్పించి, హెలీకాప్టర్ లో ఆయన స్వగ్రామం చేర్చారు. అక్కడ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే తల్లి ఆరోగ్యం బాగలేకపోవడంతో ట్రాన్స్ ఫర్ చేయించుకోవడానికి రమేశ్ జగ్ధల్ పూర్ వెళ్లాడు. అక్కడి నుంచి కూంబింగ్‌కు వెళ్లి నక్సల్స్ కాల్పుల్లో హతమయ్యాడు. రమేశ్ చివరి సారిగా హోళీ పండగ రోజు మాట్లాడినట్లు చెబుతూ భార్య సునీత కన్నీటిపర్యతం అయింది.