- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బోటులోనే బిడ్డకు జన్మనిచ్చింది
దిశ, వెబ్‌డెస్క్: బీహార్‌లో ఓ వైపు కరోనా.. మరోవైపు వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. వైరస్ నుంచి జాగ్రత్త వహిస్తున్న ప్రజలు ఇండ్లల్లోనే ఉండగా.. వరద ప్రవాహాంతో రోడ్డున పడుతున్నారు. ఈ వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు వైద్యసేవలు నోచుకోవడంలో సముద్రాన్ని ఈదాల్సిన పరిస్థితి ఉంది. అదే గర్భిణీల పరిస్థితి అయితే మరీ దారుణం. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో 25 ఏళ్ల గర్భిణీ వరద ప్రవాహంలో ప్రయాణిస్తూ బోటులోనే బిడ్డకు జన్మనిచ్చింది.
బీహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వరదల కారణంగా తూర్పు చంపారన్ జిల్లా మొత్తం జలమయం అయింది. ఈ నేపథ్యంలోనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. 9 నెలలు నిండిన గర్భిణీ(25) ఆస్పత్రికి వెళ్లేందుకు ఇబ్బందిగా ఉండడంతో.. సహాయక బృందాలు ఆమెను తమ బోటులోకి ఎక్కించారు. దగ్గరలోని ఆస్పత్రికి తరలిస్తున్న మార్గమధ్యలోనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత అంబులెన్సు ద్వారా తల్లీ-బిడ్డలను ప్రాథమిక ఆస్పత్రికి తరలించగా.. ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.