- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిడ్డను చంపి తల్లి ఆత్మహత్య
దిశ, రంగారెడ్డి: పసికందును చంపి తల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం దౌల్తాబాద్ మండలం కుదురుమల్ల గ్రామానికి చెందిన శ్రీనివాస్ నాలుగేళ్ల క్రితం తాండూరుకు చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే, మనస్పర్దల కారణంగా ఆరు నెలలకే విడిపోయారు. ఆ తర్వాత హైదరాబాద్ చేరుకున్న శ్రీనివాస్ ఓ దుస్తుల దుకాణంలో పనికి కుదిరాడు. అక్కడ పనిచేస్తుండగా మద్దూరుకు చెందిన మల్లిక (25)తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో 2017లో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి నల్లకుంటలో ఉంటున్నారు. వీరికి 11 నెలల కుమారుడు (సాత్విక్) ఉన్నాడు. కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో గత నెలలో భార్యాభర్తలు స్వగ్రామం కుదురుమల్లకు చేరుకున్నారు. శనివారం ఉదయం సాత్విక్‌కు ఆరోగ్యం బాగాలేకపోవడంతో కోస్గిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించి తీసుకొచ్చారు. మధ్యాహ్నం భోజనాల అనంతరం కుటుంబ సభ్యులు బయటకు వెళ్లారు. ఇంతలో ఏమైందో తెలియదు కాని మల్లిక కుమారుడిని చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. కాసేపటికి ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు ఉరివేసుకుని కనిపించిన మల్లికను చూసి ఒక్కసారిగా కుప్పకూలారు. సమాచారం అందుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.
tag: Mother commits suicide, killing, baby, vikarabad