- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రియుని మోజులో తల్లి కిరాతకం…
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: గుంటూరులో దారుణం చోటు చేసుకుంది. కన్నబిడ్డలను ఓ తల్లి మేకులు కొట్టిన కర్రతో హింసించి వారిపట్ల కర్కషంగా వ్యవహించింది. ఘటన వివరాల్లోకి వెళితే….బాపట్ల పట్టణానికి చెందిన ఓ వివాహిత తన భర్తను వదిలి వేసి శ్రీను అనే వ్యక్తితో కొంతకాలంగా సహజీవనం చేస్తోంది. కాగా వారిద్దరి ఏకాంతానికి పిల్లలు అడ్డుగా వస్తున్నారని ఆ తల్లి భావించింది. దీంతో వారిని కిరాతంగా హింసించడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో తన కొడుకు వీపుపై మేకులు కొట్టిన కర్రతో విచక్షణా రహితంగా బుధవారం ఆమె కొట్టింది. అనంతరం పిల్లలను ఇంటి నుంచి బయటికి నెట్టేవేసింది. కాగా ఈ విషయాన్ని స్థానికులు గమనించి పోలీసులకు విషయం తెలియజేశారు. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Next Story