కరోనాతో తల్లీ కొడుకు మృతి..

by vinod kumar |
కరోనాతో తల్లీ కొడుకు మృతి..
X

దిశ, వెబ్ డెస్క్ :

కరోనా వైరస్ సోకి రాష్ట్రంలో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. మరికొందరు ఇప్పటికీ ఆస్పత్రుల్లో కరోనాతో పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో విషాదం గురువారం చోటుచేసుకుంది.

కరోనా మహమ్మారి బారిన పడి ఒకే కుటుంబానికి చెందిన త్లలీ, కొడుకు మృతి చెందారు. వారికి పాజిటివ్ నిర్దారణ కాగా, ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. కాగా, ఇవాళ పరిస్థితి విషమించడంతో తల్లీకొడుకు మృతిచెందినట్లు తెలుస్తోంది.ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

Advertisement

Next Story