తల్లికూతుళ్ల ప్రాణాలు తీయబోయిన ‘అనుమానం’

by Sridhar Babu |   ( Updated:2021-10-23 10:36:31.0  )
తల్లికూతుళ్ల ప్రాణాలు తీయబోయిన ‘అనుమానం’
X

దిశ, గోదావరిఖని : పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లి కూతురుతో కలిసి గోదావరి నదిలో దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా గమనించిన గోదావరి రివర్ పోలీసులు వెంటనే కాపాడారు. వివరాల్లోకి వెళితే.. మంథని మండలం గాజులపల్లికి చెందిన ఆకుల సింధూజ (29) కూతురు సాత్విక(9)తో కలిసి గోదావరి నదిలో దూకారు. గమనించిన రివర్ పోలీసులు కాపాడి గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

బాధితురాలి కథనం ప్రకారం 10 సంవత్సరాల నుండి భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఎన్నిసార్లు పంచాయితీలు జరిగినా భర్త కిరణ్ ప్రవర్తనలో మార్పు రావడం లేదని బాధితురాలు పేర్కొంది. మరొకరితో ఫోన్‌లో మాట్లాడుతూ.. తనపై అనుమానం పెట్టుకుని తన భర్త కిరణ్ వేధింపులకు గురిచేస్తున్నాడని కన్నీటి పర్యంతమైంది. దీంతో మనస్తాపం చెందిన తన కూతురితో సహా చనిపోవాలి నిర్ణయించుకున్నట్టు బాధితురాలు వాపోయింది.

Advertisement

Next Story