- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రకాశంలో మరో తల్లీకూతుళ్ల డెత్ మిస్టరీ
దిశ, వెబ్ డెస్క్: ప్రకాశంజిల్లా యర్రగొండపాలెంలో విషాదం చోటు చేసుకుంది. సోమవారం అంబేద్కర్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న 22 ఏళ్ళ రేష్మా, తన 4సంవత్సరాల కూతురు సమీరా అనుమానస్పద స్ధితిలో మృతిచెందారు. రేష్మా తల్లిదండ్రులు, బంధువులు… తమ కూతురు, మనవరాలిని అల్లుడు ముసలయ్యే ఉరేసి చంపేసాడని ఆరోపిస్తున్నారు. వీళ్ళ ఆరోపణలకు సాక్ష్యంగా రేష్మా మణికట్టుపై గాయాన్ని చూపిస్తున్నారు.
యర్రగొండపాలెం సీఐ దేవప్రభాకర్, ఎస్ ఐ ముక్కంటి తల్లికూతుళ్ళ మృతదేహాలను పరిశీలించారు. ముసలయ్య, రేష్మాలకు 5 సంవత్సరాల క్రితం పెళ్ళి జరిగింది. వీరికి 4 సంవత్సరాల కూతురు సమీరా ఉంది. మొదట్లో వీరిద్దరూ అనోన్యంగా ఉన్నారని, అయితే ఇటీవల కాలంలో ముసలయ్య చెడు తిరుగుళ్ళకు అలవాటుపడి తన అక్కను వేధింపులకు గురిచేస్తున్నాడని మృతురాలి చెల్లెలు హసీనా ఆరోపిస్తున్నారు.
తన అక్రమ సంబంధాలకు అడ్డుగా ఉన్నారనే బార్యాబిడ్డలను అన్యాయంగా ఉరేసి చంపాడని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతురాలి తరపు కుటుంబ సభ్యులు ముసలయ్యే హంతకుడని ఆరోపిస్తూ… తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరుతున్నారు.
కాగా ప్రకాశం జిల్లాలో గత ఏడాది డిసెంబర్ లో తల్లీకూతుళ్ళ డెత్ మిస్టరీ సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భర్త కోటేశ్వరరావే భార్య శ్రీలక్ష్మి, నెలల పసికందును హత్య చేశాడు. పేర్నమిట్ట వద్ద వారి మృతదేహాలు కాలిన శవాలుగా దొరకడం అప్పట్లో పెనుదుమారం రేపింది.