వరుసగా పదోసారి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు యథాతథం!

by S Gopi |
వరుసగా పదోసారి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు యథాతథం!
X

న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపు పథకాలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పెరిగిన ద్రవ్యోల్బణం కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఎన్​ఎస్​సీ, పీపీఎఫ్​ సహా ఇతర పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం నుంచి ప్రభుత్వం చిన్న మొత్త్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో వరుసగా పదోసారి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లకు సంబంధించి యథాతథ స్థితినే అనుసరించింది. తాజా నిర్ణయంతో పీపీఎఫ్ పథకాలపై 7.1 శాతం, ఎన్ఎస్‌సీ పథకంపై 6.8 శాతం వడ్డీ అమలవుతుంది.

దీనికి సంబంధించి గురువారం కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం, 2022, జూలై 1 నుంచి సెప్టెంబర్​ 30 వరకు వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు యథాతథంగా కొనసాగుతాయి. నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌పై 6.8 శాతం, పీపీఎఫ్‌పై 7.1 శాతం, కిసాన్‌ వికాస్‌పత్ర 6.9 శాతం, సుకన్య సమృద్ధి యోజన పథకానికి 7.6 శాతం వడ్డీ లభిస్తోంది. నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌(ఎస్ఎస్‌సీ), పబ్లిక్‌ ప్రావిడెండ్‌ ఫండ్‌(పీపీఎఫ్), కిసాన్‌ వికాస్‌ పత్ర(కేవీపీ), సుకన్య సమృద్ధి యోజన(ఎస్ఎస్‌వై) వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ప్రతి మూడు నెలలకోసారి కేంద్రం వడ్డీ నిర్ణయిస్తుంది. అయితే, గత 8 త్రైమాసికాలుగా కేంద్రం ఈ వడ్డీల్లో ఎలాంటి మార్పులు చేయలేదు సవరించలేదు.

Advertisement

Next Story

Most Viewed