గూగుల్‌లో అత్యధికంగా వెతికింది దీని గురించే…

by Anukaran |   ( Updated:2024-06-29 16:15:17.0  )
గూగుల్‌లో అత్యధికంగా వెతికింది దీని గురించే…
X

దిశ, వెబ్ డెస్క్: మానవాళి జీవితంపై ‘కరోనా’ తీవ్ర ప్రభావం చూపింది. 2020, సంవత్సరం మొదలు.. ముగింపు వరకు సగటు మనిషి మహమ్మారి గురించే ఆలోచించాడు. చర్చించాడు. వెతికాడు కూడా. కానీ, ఐపీఎల్‌ను మాత్రం వెనక్కి నెట్టలేకపోయింది. ఇదే విషయం గూగుల్ కూడా స్పష్టం చేసింది. ఈ ఏడాదిలో భారతీయులు గూగుల్‌లో అత్యధికంగా వెతికింది ఐపీఎల్ గురించే. ఆ తర్వాతి స్థానం కరోనా వైరస్‌దే. 2020లో ప్రపంచ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌లో అత్యధికంగా వెతికిన డేటాను విడుదల చేసింది.

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మార్కెట్‌ను భారత్ కలిగి ఉంది. కొవిడ్-19 మహమ్మారి కారణంగా ఐపీఎల్-2020ను యూఏఈకి తరలించి విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. అంత ఆదరణ క్రికెట్‌ను కూడా మహమ్మారి భయం గూగుల్‌లో అత్యధికంగా వెతికేలా చేసింది.

మహమ్మారి భయాందోళనలతో ఎక్కువ సమయం గడపాల్సి వచ్చింది. చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం సౌకర్యం కల్పించాయి. ఎక్కువ మంది ఇంట్లోనే ఉండటంతో గూగుల్‌లో రోగ నిరోధక శక్తి పెంచుకోవడం, వంటలు, ప్రత్యేకంగా డల్గొనా కాఫీ చేయడం గురించి వెతికారు.

దేశంలో మహమ్మారి వ్యాప్తి మొదలు కావడంతో మార్చి నెల ఆఖరు నుంచి మే చివరి వరకు సుదీర్ఘ లాక్‌డౌన్ విధించారు. ఆ తర్వాత సడలింపులు ఇస్తూ వచ్చారు. ఈ కాలంలో ‘near me’లో అత్యధికంగా ఆహార వసతి, కొవిడ్-19 పరీక్షలు, టపాకాయలు ఆ తర్వాత మద్యం షాపుల కోసం విపరీతంగా వెతికారట.

ప్రపంచ వ్యాప్తంగా కూడా ‘కరోనా వైరస్’ గురించే అత్యధికంగా వెతికారు. ఆ తర్వాత స్థానాలు అమెరికా ఎన్నికల ఫలితాలు, దివంగత బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు కొబె బ్రయంట్ కోసం సెర్చ్ చేశారు. ఇక గూడుల్ మోస్ట్ పాపులర్ పర్సనాలిటీగా అమెరికా తదుపరి అధ్యక్షుడు జో బైడెన్ నిలిచారు.

Video Source :YouTube, Google

Video Credit to : Google, LLC

Click Here For Video Post..

Advertisement

Next Story

Most Viewed