- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ రెండు రాష్ట్రాల్లోనే సగానికి పైగా కేసులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా మహారాష్ట్ర, కేరళలో మాత్రం మహమ్మారి విజృంభణ ఆగట్లేదు. కొన్ని నెలల ముందుతో పోల్చితే ఈ రాష్ట్రాల్లో కేసులు కాస్త తక్కువగానే నమోదవుతున్నప్పటికీ, దేశవ్యాప్తంగా చూసినప్పుడు మాత్రం ఇక్కడినుంచే సగానికిపైగా కొత్త కేసులు రిపోర్ట్ కావడం ఆందోళన కలిగించే విషయం. గతవారంలో దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో కేరళ, మహారాష్ట్ర నుంచే 53శాతం కేసులు రిపోర్ట్ అయినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గతవారం దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో కేరళ(32శాతం), మహారాష్ట్ర(21శాతం) నుంచే సగానికిపైగా వచ్చాయని వెల్లడించారు. అలాగే, 80శాతం కొత్త కేసులు 15 రాష్ట్రాలు, యూటీల్లోని 90జిల్లాల నుంచే రిపోర్ట్ అవుతున్నాయని వెల్లడించారు. కాగా, గతవారం(ఈ నెల 2నుంచి 8వరకు)లో దేశవ్యాప్తంగా 2,97,923 కేసులు నమోదవ్వగా, కేరళ, మహారాష్ట్రల నుంచే 1,57,899(53శాతం) కేసులు రిపోర్ట్ అయ్యాయి. మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 61,31,976కు చేరగా, కేరళలో 30,25,466కు పెరిగాయి. దేశంలో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర, కేరళ తొలి రెండు స్థానాల్లో ఉండటం గమనార్హం.
నిర్లక్ష్యంతోనే వైరస్ ముప్పు
దేశంలో సెకండ్ వేవ్ ఇంకా ముగిసిపోలేదని, అలా గనుక మనం అనుకున్నట్టయితే ఓసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని లవ్ అగర్వాల్ తెలిపారు. దేశంలోని పలు పర్యాటక ప్రదేశాల్లో జనాలు కొవిడ్ నిబంధనలు పాటించకుండా గుమిగూడి ఉన్న విజువల్స్‌ను చూపిస్తూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్లక్ష్యపూరిత ప్రవర్తన వైరస్ వ్యాప్తి ముప్పును పెంచుతుందని వాపోయారు. కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
గర్భిణులు టీకా తప్పనిసరిగా తీసుకోవాలి: వీకే పాల్
గర్భిణులు కొవిడ్ టీకా తప్పనిసరిగా తీసుకోవాలని నీతి అయోగ్ సభ్యుడు(ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్ శుక్రవారం వెల్లడించారు. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ప్రస్తుతమున్న కొవిడ్ టీకాలు గర్భిణులకు సురక్షితమేనని స్పష్టంచేశారు. వారు కొవిడ్ బారినపడితే కడుపులోని బిడ్డకూ ముప్పేనని తెలిపారు. అంతేకాకుండా వైరస్ సోకిన గుర్భిణులు నెలలు నిండకముందే డెలివరీ అయ్యే ప్రమాదముందని అధ్యయనాలు చెబుతున్నట్టు వెల్లడించారు. కావున, వారు వ్యాక్సిన్ తీసుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు.