- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ ప్రతినిధి, వరంగల్: టీపీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన మల్కాజిగిరి ఎంపీ అనుమల రేవంత్ రెడ్డి తన వెంట నడిచే వారికే పార్టీలో పెద్ద పీట వేయడం ఖాయంగా కనిపిస్తోంది. మంగళవారం ములుగు ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా కార్యదర్శి సీతక్క 100 కార్లలో శ్రేణులతో కలసి హైదరాబాద్‌కు చేరుకుని రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీతక్కను ఉద్దేశించి రేవంత్ రెడ్డిని మాట్లాడుతూ.. ఒక్క మాటలో పార్టీలో ఆమెకు ఇస్తున్నా ప్రాధాన్యం గురించి కుండబద్దలు కొట్టారు. పార్టీలో ఇకపై తానెంతో సీతక్క అంతేనంటూ వ్యాఖ్యనించారు.
పవర్ సెంటర్‌గా సీతక్క
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి సొంత టీంను రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసుకోవడంపై దృష్టి పెట్టారు. ఒకవైపు సీనియర్లను బుజ్జగిస్తూనే.. జనంలో ఆదరాభిమానాలు కలిగిన నేతలకు, తన నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేసే నేతలకు తన టీంలో మంచి అవకాశాలు, ప్రాధాన్యం కల్పించే యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. సీతక్క విషయానికి వస్తే.. జనాభిప్రాయాన్ని బలంగా అసెంబ్లీలో వినిపించడంలో ఇప్పటికే విజయవంతమయ్యారని రేవంత్ భావిస్తున్నారు.
రేవంత్ రెడ్డితో పాటే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి స్వయంగా రాహుల్, సోనియా గాంధీకి కూడా పరిచయం చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే పార్టీలో జాతీయ మహిళా కార్యదర్శి పదవికి నియామకం జరిగింది. సీతక్క లాక్‌డౌన్ సమయంలో గిరిజనులను ఆదుకున్న విధానం జాతీయ మీడియాను సైతం ఆకర్షించింది. రాహుల్ గాంధీ స్వయంగా సీతక్కపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆస్సాంలో జరిగిన ఎన్నికల బాధ్యతలను కూడా అప్పగించారు.
ఇప్పటికే జాతీయస్థాయిలో ఆమెకు మంచి పేరు ఉండటం, ప్రస్తుతం రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి పార్టీ బాధ్యతలు లభించడం వంటి పరిణామాలు ఆమెను కాంగ్రెస్‌లో తిరుగులేని నాయకురాలిగా నిలబెట్టడంలో ఉపయోగపడతాయనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో పార్టీ బలోపేతంలో రేవంత్ రెడ్డికి ఆమె బలం కానున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఆమె అభిప్రయాలు, ఆలోచనలు కాంగ్రెస్ పార్టీ పునరేకీకరణ క దోహదం చేస్తాయని ఆమె అభిమానులు వ్యక్తం చేస్తున్నారు