అమ్మకానికి సిద్ధంగా చంద్రుని ముక్క

by Harish |
అమ్మకానికి సిద్ధంగా చంద్రుని ముక్క
X

దిశ, వెబ్‌డెస్క్: ఆకాశం నుంచి ఊడిపడ్డ ఒక చందమామ ముక్క వేలానికి సిద్ధంగా ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద చంద్రుని ఉల్కల్లో ఇది ఒకటి. 2 మిలియన్ పౌండ్లకు ప్రస్తుతం క్రిస్టీ వద్ద అమ్మకానికి రెడీ అయ్యింది. 13.5 కేజీలు బరువు ఉన్న ఈ రాయి చంద్రునితో ఆస్ట్రరాయిడ్ ఢీకొన్నపుడు సహారా ఎడారిలో ఉల్కాపాతం పడింది. ఆ ఉల్కల్లో ఇది అతిపెద్ద ఉల్క.

ఎన్‌డబ్ల్యూఏ 12691గా పిలిచే ఈ రాయి, ఇప్పటివరకు చంద్రుని మీద పడిన పెద్దరాళ్లలో ఐదో స్థానంలో ఉంది. పూర్తిగా వేరే లోకానికి చెందిన ఒక వస్తువును చేతిలో పట్టుకోవడం నిజంగా వర్ణించలేని అనుభూతి అని క్రిస్టీ సైన్స్ హెడ్ జేమ్స్ హైస్లోప్ అభిప్రాయపడ్డారు. ఇది కచ్చితంగా చంద్రుని ముక్క అని స్పష్టత కోసం అమెరికా వారి అపోల్ స్పేస్ మిషన్ ద్వారా తీసుకొచ్చిన శాంపిళ్లతో శాస్త్రవేత్తలు పరీక్ష చేశారు. భూమ్మీద ఎన్నో ఉల్కలు పడతాయి, కానీ వాటిల్లో చంద్రుని ముక్క ఉండటం చాలా అరుదు. అందుకే ఈ చంద్రుని ముక్కకి వేలంలో మంచి గిరాకీ వస్తుందని జేమ్స్ ఆశావ్యక్తం చేస్తున్నాడు.

Tags: Moon, Asteroid, rock, sale, Christy, Hyslop, Bid

Advertisement

Next Story