- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత ఆర్థిక వృద్ధి రేటును సవరించిన మూడీస్
దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక వృద్ధి రేటు 7 శాతానికి క్షీణిస్తుందని అభిప్రాయపడింది. ఇదివరకు భారత జీడీపీ 10.6 శాతం ప్రతికూలంగా ఉంటుందని మూడీస్ అంచనా వేసింది. అదేవిధంగా, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే 2021-22 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 10.08 శాతం నుంచి 13.7 శాతానికి సవరిస్తున్నట్టు వెల్లడించింది. భారత ఆర్థికవ్యవస్థ ప్రపంచంలోనే ఎక్కువ రోజుల కఠినమైన లాక్‌డౌన్ నుంచి చాలా తొందరగా పుంజుకుంది. ఈ లాక్‌డౌన్ వల్ల గతేడాది రెండో త్రైమాసికంలో జీడీపీ బాగా పడిపోయిందని మూడీస్ అభిప్రాయపడింది.
‘దేశంలోని మొత్తం ఆర్థిక కార్యకలాపాల్లో ఎక్కువ భాగం 2020 చివరి నాటికి మహమ్మారి పూర్వస్థాయికి కోలుకున్నాయి. ఈ నేపథ్యంలోనే తమ వృద్ధి అంచనాలను సవరించినట్టు’ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అసోసియేట్ మేనేజింగ్ డైరెక్టర్ జీన్ ఫాంగ్ ఓ ప్రకటనలో చెప్పారు. కాగా, 2020-21 ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసే త్రైమాసిక జీడీపీ గణాంకాలను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేయనుంది. ఇటీవల పరిణామాల నేపథ్యంలో మూడో త్రైమాసిక గణాంకాలు సానుకూల వృద్ధిని నమోదు చేస్తాయని పలు రేటింగ్ ఏజెన్సీలు ఆశిస్తున్నాయి.