- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అకస్మాత్తుగా ప్రత్యక్షమైన మోనోలిత్
దిశ, వెబ్‌డెస్క్: హాలీవుడ్ సినిమా ప్రియులకు ‘2001: ఎ స్పేస్ ఒడిస్సీ’ సినిమా గురించి తెలిసే ఉంటుంది. ఖాళీగా ఉన్న గ్రహం మీద అకస్మాత్తుగా కనిపించిన మెరిసే మోనోలిత్ చుట్టూ ఈ కథ తిరుగుతుంటుంది. ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే, అచ్చం అలాంటి మోనోలిత్ ఒకటి ఇప్పుడు అమెరికాలోని ఉటా రాష్ట్రంలో ప్రత్యక్షమైంది. అంగారక గ్రహాన్ని తలపించే ఉటాలోని ఎరుపు రంగు రాతి కొండల మధ్య ఎవరో వచ్చి పెట్టినట్లుగా ఈ మెరిసే, వెండి రంగు మోనోలిత్‌ను ఉటా డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ సిబ్బంది గుర్తించారు. వాయవ్య ఉటాలో ఉన్న పొడవాటి కొమ్ముల గొర్రెల సంఖ్యను హెలికాప్టర్ ద్వారా సర్వే చేస్తున్న క్రమంలో ఈ మోనోలిత్ కనిపించింది. ఈ నెల 18న ఇది కనిపించగానే సిబ్బంది అక్కడ దిగి దాన్ని పరిశీలించారు.
మూడు భుజాలు ఉన్న ఈ స్టెయిన్‌స్టీల్ వస్తువు ఇద్దరు మనుషులు నిలబడినంత ఎత్తు ఉంది. దాన్ని ఇక్కడ, ఈ రాళ్ల మధ్య ఎవరు తీసుకొచ్చి పెట్టి ఉంటారని, అది ఎలా వచ్చి ఇక్కడ ఉంటుందనేది వాళ్లకు అర్థం కాలేదు. ఇది వేరే గ్రహానికి చెందినది కాదని ఉటా పబ్లిక్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ అంటోంది. 12 అడుగుల ఈ నిర్మాణాన్ని తయారుచేసి, తీసుకొచ్చి, ఇలా అమర్చడానికి చాలా ప్లానింగ్ అవసరం. అలాగే దీన్ని పెట్టిన ప్రదేశం కూడా ఎక్కడో మారుమూలన ఉంది. సాధారణ ప్రజలు అక్కడికి వెళ్లడం చాలా కష్టం. అంతేగాకుండా ఈ ప్రదేశంలో ఏదన్నా వస్తువును పడేయాలన్నా, ఇక్కడి నుంచి ఏదైనా తీసుకెళ్లాలన్నా అధికారుల అనుమతి తప్పనిసరి. దీంతో ఈ మోనోలిత్ ఎలా వచ్చిందని అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ప్రస్తుతానికి ఈ మోనోలిత్ ఎప్పటి నుంచి ఉంది? దీన్ని ఎవరు తయారుచేసుంటారు, దీన్ని తొలగించడం సాధ్యమేనా లాంటి విషయాల గురించి పరిశోధనలు చేస్తున్నారు.