- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డేంజర్ బెల్స్ : మళ్లీ విజృంభిస్తున్న ‘మంకీ పాక్స్’ వైరస్..
దిశ, వెబ్‌డెస్క్ : ‘మంకీ పాక్స్’ వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా అమెరికాలో ఓ వ్యక్తికి ఈ వైరస్ లక్షణాలు ఉన్నట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) మరియు టెక్సాస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ హెల్త్ సర్వీసెస్ జూలై 15న తేదీన ధృవీకరించింది. అతను ఇటీవల నైజీరియా నుంచి అమెరికాకు ట్రావెల్ చేశాడు. ఆ వ్యక్తి ప్రస్తుతం డల్లాస్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే, బాధితుడు రెండు విమానాలు మారిన సమయంలో రోగితో సంబంధాలు కలిగియున్న తోటి ప్రయాణికులను, ఇతరులను సంప్రదించడానికి సీడీసీ ఎయిర్లైన్స్ రాష్ట్ర మరియు స్థానిక ఆరోగ్య అధికారులతో కలిసి పనిచేస్తోంది. అనారోగ్యం బారిన పడిన వ్యక్తి జూలై 8న నైజీరియాలోని లాగోస్ నుంచి అట్లాంటాకు.. జూలై-9న అట్లాంటా నుండి డల్లాస్ ప్రయాణించినట్లు అధికారులు గుర్తించారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం COVID-19 మహమ్మారి కారణంగా విమానాల్లో ప్రయాణికులు మాస్కులు ధరించడం తప్పనిసరి అయ్యింది. అందువల్ల విమానాలలో, ఏయిర్ పోర్టుల్లో ‘శ్వాసకోశ బిందువుల’ ద్వారా ‘మంకీపాక్స్’ వ్యాప్తి చెందే ప్రమాదం తక్కువగా ఉందని నమ్ముతున్నారు అధికారులు.
మంకీపాక్స్ వ్యాధి తీవ్రత ఎంత..
మంకీపాక్స్ అనేది అరుదైన వ్యాధి. దీని బారిన పడితే తీవ్రమైన వైరల్ జ్వరం వస్తుంది. ఇది సాధారణంగా ఫ్లూ లాంటి అనారోగ్యం మరియు శోషరస కణుపుల(Lymph nodes) వాపుతో మొదలై ముఖం మరియు శరీరంపై విస్తృతంగా దద్దుర్లు వస్తాయి. చాలా అంటువ్యాధులు 2 నుంచి 4 వారాలు ఉంటాయి. మంకీపాక్స్ అనేది మశూచి వలె వైరస్‌ల కుటుంబానికి చెందినది. కానీ, తేలికపాటి సంక్రమణకు కారణమవుతుంది. ఈ సందర్భంగా సీడీసీ ప్రయోగశాలలో నిర్వహించిన పరీక్షలో రోగికి నైజీరియాతో సహా పశ్చిమ ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణంగా కనిపించే మంకీపాక్స్ వైరస్ బారిన పడినట్లు గుర్తించారు. మంకీపాక్స్ వైరస్ సోకిన 100 మందిలో ఒకరు చనిపోయే అవకాశం ఉంది. అయినప్పటికీ, ఇదికూడా కరోనా మహమ్మారి వలే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తుల్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని సమాచారం.
ఎక్కడ పుట్టింది..
ఆఫ్రికాలో తొలిసారిగా మంకీపాక్స్ వైరస్ 1970లో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత నైజీరియాతో పాటు మధ్య పశ్చిమ ఆఫ్రికాలోని మరో తొమ్మిది దేశాలలో కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందింది. ఇదిలాఉండగా, దిగుమతి చేసుకున్న ఆఫ్రికన్ ఎలుకల నుండి పెంపుడు జంతువులు, ప్రేరీ కుక్కలకు ఈ వైరస్ వ్యాప్తి చెందడంతో 2003లో అమెరికాలో ‘మంకీపాక్స్’ పెద్ద వ్యాప్తికి కారణమైంది. దాదాపు 18 సంవత్సరాల తర్వాత మరోసారి యునైటైడ్ స్టేట్స్‌లో ఈ వైరస్ వ్యాప్తిచెందడంతో అధికారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
ఎలా వ్యాప్తి చెందుతుంది..
ప్రకృతిలో మంకీపాక్స్ ఎక్కడ దాక్కుంటుందో నిపుణులు ఇంకా గుర్తించలేదు. అయితే, ఆఫ్రికన్ ఎలుకలు మరియు చిన్న క్షీరదాలు, ప్రజలకు మరియు కోతుల వంటి ఇతర అటవీ జంతువులకు వైరస్ వ్యాప్తి చెందడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయని తెలుస్తోంది. వైరస్ సోకిన జంతువులు కరిచినప్పుడు లేదా గీయబడినప్పుడు, అడవిలో మిగతా జంతువులతో ఆట సందర్భంలో లేదా జంతు ఉత్పత్తులతో సంబంధాలు కలిగి ఉన్నప్పుడు ప్రజలు కోతిపాక్స్ బారిన పడుతారు. మంకీపాక్స్ అనేది శ్వాసకోశ బిందువుల ద్వారా లేదా శరీర ద్రవాలు, మంకీపాక్స్ పుండ్లు లేదా వాటి ద్రవాలు ముట్టుకున్నప్పుడు, కలుషితమైన వస్తువులు, దుస్తువుకు అంటుకున్నప్పుడు, సంపర్కం ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. మనుషుల కలయిక, సాన్నిహిత్యం వలన కూడా సంభవిస్తుందని సమాచారం.
ఎన్ని దేశాల్లో వ్యాపించింది..
ప్రస్తుతం అమెరికాలో నమోదైన కేసుకంటే ముందు నైజీరియా నుండి తిరిగి వచ్చే ప్రయాణికులలో కనీసం ఆరు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. అవి (యునైటెడ్ కింగ్‌డమ్, ఇజ్రాయెల్ మరియు సింగపూర్ కేసులతో సహా). ఈ కేసు ఈ మునుపటి కేసులకు సంబంధించినది కాదు. యునైటెడ్ కింగ్‌డమ్‌లో, కేసులతో సంబంధం ఉన్న వ్యక్తులలో అనేక అదనపు మంకీపాక్స్ కేసులు సంభవించాయి.