మొహర్రం పండుగ కూడా ఇళ్లలోనే: సీపీ

by Anukaran |
మొహర్రం పండుగ కూడా ఇళ్లలోనే: సీపీ
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం : కరోనా వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవ మండపాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం లేదని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ నెల 22వ తేదీన నిర్వహించుకోనే వినాయక చవితి పండుగ సందర్భంగా సామూహిక పూజలతో పాటు, బహిరంగ ప్రదేశాలలో గణేష్ నవరాత్రి ఉత్సవ నిర్వహణకు మండలపాల ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు లేనందున ప్రజలందరూ ఎవరి ఇంటి వద్ద వారే వినాయక చవితి పూజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలన్నారు.

అదే విధంగా మొహర్రం పండుగను సైతం ముస్లిం సోదరులు తమ ఇంటిలోనే నిర్వహించుకోవాలని, కొవిడ్ 19 నేపథ్యంలో పోలీసుల సూచనను పాటించి కరోనాను నియంత్రించడంలో ప్రజలందరూ తమ వంతు భాధ్యతగా పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా పోలీసుల నిబంధనలు అతిక్రమిస్తే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed