ఆప్త మిత్రుడి అరుదైన కానుక.. మురిసిన చిరు!

by  |
ఆప్త మిత్రుడి అరుదైన కానుక.. మురిసిన చిరు!
X

ఇండస్ట్రీలో ఆ ఇద్దరి కాంబోలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్టే. నటనలోనూ ఇద్దరూ ఇద్దరే.. పోటాపోటీగా నటించారు, ఆప్తమిత్రులుగా ఒకరికి అండగా మరొకరున్నారు. వారి కుటుంబాల మధ్య కూడా మంచి సంబంధాలున్నాయి. ఆ తర్వాత.. ఏదో భేదాభిప్రాయాలు, మనస్పర్థల కారణంగా కొంతకాలం దూరంగా ఉన్నా.. మళ్లీ ఆనాటి స్నేహం చిగురించింది. ప్రస్తుతం వీరిద్దరూ సన్నిహితంగా ఉండటం.. అందరూ హర్షిందగ్గ విషయమే. ఇంతకీ ఆ ఆత్మీయ మిత్రులు మరెవరో కాదు.. చిరంజీవి, మోహన్ బాబు. తన చిరకాల మిత్రుడు చిరంజీవి బర్త్ డే సందర్భంగా.. ఓ అపూర్వ కానుక పంపించాడు మోహన్ బాబు. ఆ కానుక చిరంజీవిని ఫిదా చేయడం విశేషం.

శనివారం చిరంజీవికి ట్విట్ట‌ర్ ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపిన మోహ‌న్ బాబు.. ‘చిరంజీవి నాకు మంచి మిత్రుడు, అతని పేరులోనే ఉంది.. చిరంజీవి అంటే ఆంజనేయస్వామి. అంటే ఎల్లకాలము చిరంజీవివై వర్ధిల్లుగాక. నిండు నూరేళ్ళు ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో పుట్టినరోజు జరుపుకోవాలని ఆ షిరిడీ సాయినాథున్ని కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ మై డియర్ ఫ్రెండ్’ అంటూ ట్వీట్ చేశారు. అంతటితో మోహన్ బాబు ఊరుకోలేదు.. తన ఆప్త మిత్రుడిని పుట్టిన రోజు సందర్భంగా ఆనందంలో ముంచెత్తాలనుకున్నాడు. అందుకోసం మెగాస్టార్‌కు అరుదైన కానుక‌ను అందజేశాడు.

ఉడ్‌తో త‌యారు చేసిన వింటేజ్ బైక్ క‌ళాకృతిని మోహ‌న్ బాబు.. చిరుకు గిఫ్ట్‌గా ఇవ్వ‌డంతో అది చూసి మెగాస్టార్ మురిసిపోయాడు. త‌న చిరకాల మిత్రుడు మోహన్ బాబు ఎంతో ప్రేమగా అందించిన కానుకను ట్విట్ట‌ర్ ద్వారా అభిమానులకి చూపించారు. ‘నా చిరకాల మిత్రుడు, తొలిసారిగా నా పుట్టిన రోజున ఓ కళాకృతిని కానుకగా పంపాడు. ఆ కానుకలో అతని రాజసం, వ్యక్తిత్వం ఉట్టిపడుతున్నాయి’. ప్రియ నేస్తం మోహ‌న్ బాబుకు కృత‌జ్ఞ‌త‌లు అంటూ చిరు పేర్కొన్నారు.


Next Story