కళ్యాణి, ప్రణవ్ రిలేషన్‌పై మోహన్‌లాల్ క్లారిటీ

by Anukaran |   ( Updated:2020-08-16 06:41:59.0  )
కళ్యాణి, ప్రణవ్ రిలేషన్‌పై మోహన్‌లాల్ క్లారిటీ
X

మాలీవుడ్ మెగాస్టార్ మోహన్ లాల్ తనయుడు ప్రణవ్, ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ తనయ కళ్యాణి ప్రియదర్శన్ ప్రేమలో ఉన్నారని ఎప్పటి నుంచో రూమర్లు వినిపిస్తున్నాయి. కానీ వీటిపై సీరియస్‌గా రియాక్ట్ అయిన కళ్యాణి.. మేమిద్దరం మంచి స్నేహితులమని క్లారిటీనిచ్చింది. అయితే ఈ మధ్య చాలా క్లోజ్‌‌గా ఉన్న వీరిద్దరి సెల్ఫీ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేయడంతో ఈ వార్తలు మళ్లీ జోరందుకున్నాయి.

ఇదే విషయాన్ని మోహన్ లాల్‌ను అడిగితే తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. చిన్నప్పటి నుంచి స్నేహితులుగా ఉన్న ప్రణవ్, కళ్యాణి ఫొటో దిగితే అలా ఎలా? అనుకుంటారని ప్రశ్నించాడు. నేను, ప్రియదర్శన్ ఎలా స్నేహితులమో.. ప్రణవ్, కళ్యాణి కూడా అంతే అని.. కానీ ఆడ, మగ కావడం వల్ల వారిద్దరి మధ్య లవ్ ఉందని రూమర్స్ స్ప్రెడ్ చేయడం కరెక్ట్ కాదన్నారు. అంతేకాదు ప్రణవ్ తల్లి, కళ్యాణి తల్లి కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అని.. అనవసర ఫేక్ న్యూస్ ప్రచారం చేయొద్దని కోరాడు.

కాగా, తొలిసారి ఈ ఇద్దరు స్నేహితులు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. మోహన్ లాల్ – ప్రియదర్శన్ కాంబినేషన్‌లో వస్తున్న ‘మరక్కర్ అరబికర్ కదలింటే’ సినిమాలో కలిసి నటించబోతున్నారు. దీంతో పాటు వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వంలో హృదయం సినిమా చేస్తున్నారు ప్రణవ్, కళ్యాణి.

Advertisement

Next Story