పేదల దైవం మా బావ : మోహన్ బాబు

by Anukaran |   ( Updated:8 July 2020 8:19 AM  )
పేదల దైవం మా బావ : మోహన్ బాబు
X

దిశ, ఏపీ బ్యూరో: మాట తప్పలేరు మానధనులు అన్న పోతన మాటకు నిలువెత్తు నిదర్శనం మా బావ దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అని ప్రముఖ సినీ నటుడు, వైసీపీ కీలక నేత మోహన్ బాబు కొనియాడారు. రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి సందర్భంగా ట్విట్టర్ మాధ్యమంగా నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ స్నేహశీలి అని..”పేద ప్రజల దైవం మా బావగారైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పుట్టినరోజు నేడు. బావగారు ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన దీవెనలు మా కుటుంబానికి, తెలుగు ప్రజలకు ఉండాలని కోరుకుంటున్నా” అంటూ మోహన్ బాబు ట్వీట్ చేశారు.

Next Story

Most Viewed