- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాపై కలెక్షన్ కింగ్ కథ విన్నారా?… ఆలోచించండి…
దిశ, వెబ్‌డెస్క్: వినాశకాలే విపరీత బుద్ధి అంటారు పెద్దలు. పోయేకాలం వస్తే బుద్ధి పెడదారి పడుతుందన్నది దీని సారాంశం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించినా పట్టించుకోకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్న వారిని ఉద్దేశించి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చెప్పిన మాట ఇది. ఇప్పటికి కూడా పెద్దలు చెప్పిన మాటలు వినిపించుకోకపోతే… పెద్ద విపత్తునే చూస్తారని హెచ్చరిస్తున్నారు. చెప్పింది వినకపోతే ఏం జరుగుతుందో రామాయణంలో ఉన్న కథలను ఉదహరించారు.
వాలి సుగ్రీవులు ఇద్దరు అన్నదమ్ములు… రాజ్యం, భార్య విషయంలో గొడవపడతారు… ఈ యుద్ధంలో సుగ్రీవుడు ఓడిపోతాడు.. కానీ వెంటనే మళ్లీ యుద్దానికి పిలుస్తాడు. ఇందులో ఏదో మర్మం ఉందని అప్పటికీ హెచ్చరిస్తుంది భార్య. రక్తపు మరకైనా ఆరక ముందే యుద్ధానికి పిలుస్తున్నాడు.. ఏదో ఆపద పొంచి ఉంది అని భర్తకు చెప్తుంది. కానీ… భార్య మాట వినకుండా యుద్ధానికి వెళ్లిన వాలి సుగ్రీవుడి చేతుల్లో మరణిస్తాడు. అర్ధాంగి చెప్పినప్పుడు వింటే బ్రతికి ఉండేవాడు. చెప్పింది వినకపోవడం వల్లే చనిపోయాడని తెలిపారు మోహన్ బాబు.
A small story…#StayHomeStaySafe#COVID2019india#CoronaPandemic pic.twitter.com/PxFZmu9U22
— Mohan Babu M (@themohanbabu) March 30, 2020
అలాగే సీత.. మహా సాద్వీమణి… లక్ష్మణ రేఖ గీసి ఈ గీత దాటి బయటకు రావొద్దు.. ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించాడు లక్ష్మణుడు. కానీ దాటింది… ఎక్కడ లేని కష్టాలను అనుభవించింది.
దీన్ని బట్టి ఏం అర్ధమవుతుంది. పెద్దలు చెప్పే మాట వినాలి. ప్రస్తుతం మనం చాలా విపత్కర పరిస్థితుల్లో ఉన్నాం.. కరోనాను కట్టడి చేయాలంటే పెద్దలు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్లు నడుచుకోవాలి… ఇంట్లోనే సుఖంగా ఉండాలి… భగవంతున్ని ప్రార్థించుకోవాలి. కానీ చాలా మంది వినడం లేదని .. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదని హెచ్చరించారు. అందరం పెద్దలు చెప్పిన మాటలు వింటూ కరోనా నుంచి కోలుకుందామని ఆశించారు.
Tags : Mohan Babu, CoronaVirus, Covid 19