పాకిస్తాన్ చీఫ్ సెలెక్టర్‌గా మహ్మద్ వాసిమ్

by Shyam |   ( Updated:2020-12-20 00:36:58.0  )
పాకిస్తాన్ చీఫ్ సెలెక్టర్‌గా మహ్మద్ వాసిమ్
X

దిశ, స్పోర్ట్స్ : పాకిస్తాన్ క్రికెట్ కమిటీ హెడ్, చీఫ్ సెలెక్టర్‌గా మాజీ క్రికెటర్ మహ్మద్ వాసింను నియమించారు. ప్రస్తుత చీఫ్ సెలెక్టర్ మిస్బా ఉల్‌హక్ స్థానంలో వాసింను నియమిస్తున్నామని, 2023 ప్రపంచ వరల్డ్ కప్ వరకు అతడే సెలెక్షన్ కమిటీని నడిపిస్తాడని పీసీబీ చైర్మన్ ఎహసాన్ మణి శనివారం ప్రకటించారు. చీఫ్ సెలెక్టర్ పోస్టుకోసం ఆన్‌లైన్‌లో డిసెంబర్ 17,18న ఇంటర్వూలు నిర్వహించి.. వాసిమ్‌ను ఎంపిక చేశారు.

కాగా గత సెలెక్షన్ కమిటీలో వాసిమ్ ఒక సభ్యుడు కావడం గమనార్హం. జనవరిలో దక్షిణాఫ్రికా జట్టు పాకిస్తాన్ పర్యటనకు రానున్నది. అప్పటి నుంచి వాసిమ్ అధికారికంగా చీఫ్ సెలెక్టర్ పదవి బాధ్యతలు చేపడతాడు. ప్రస్తుతం నార్తన్ క్రికెట్ అసోసియేషన్ హెడ్‌కోచ్‌గా ఉన్న వాసిమ్.. ఆ పదవికి రాజీనామా చేయనున్నాడు. 1996 నుంచి 2000 మధ్య వాసిమ్ పాకిస్తాన్ తరపున 18 టెస్టులు, 25 వన్డేలు ఆడాడు. దేశవాళీ క్రికెట్‌లో 191 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్నది.

Advertisement

Next Story