- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో మహ్మద్ సిరాజ్..?
దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ అగస్టు 4 నుంచి ట్రెంట్‌బ్రిడ్జ్‌లో ప్రారంభం కానున్నది. డబ్ల్యూటీసీ తుది జట్టులో ఆడిన ఇషాంత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా బంతితో రాణించలేక పోయారు. కేవలం మహ్మద్ సిరాజ్ మాత్రమే వికెట్లు తీసి కివీస్ జట్టుపై ఒత్తిడి తెచ్చాడు. కేవలం పేస్ బౌలర్లు విఫలం చెందడం వల్లే మ్యాచ్ చేజారిందని క్రికెట్ విశ్లేషకులు తేల్చి చెప్పారు. దీంతో ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో బౌలింగ్ విభాగంలో మార్పులు చేయాలని టీమ్ ఇండియా యాజమాన్యం భావిస్తున్నది. ఇషాంత్ శర్మ బదులు మహ్మద్ సిరాజ్‌ను తీసుకోవాలని యాజమాన్యం నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా సిరీస్‌లో టెస్ట్ కెరీర్ ప్రారంభించిన సిరాజ్.. ఇప్పటి వరకు 5 టెస్టులు ఆడి 16 వికెట్లు తీశాడు.
ముఖ్యంగా బౌన్సీ వికెట్లపై సిరాజ్ చక్కని బంతులు విసురుతున్నాడు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టడంలో సిరాజ్ సఫలం అవుతున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో సిరాజ్‌ను ఆడించి ఉంటే కచ్చితంగా ఫలితం మరోలా ఉండేదని సీనియర్ క్రికెటర్లు కూడా వ్యాఖ్యానించారు. ఆ రోజు చేసిన తప్ప మరోసారి చేయకూడదని.. ఇంగ్లాండ్ పిచ్‌లకు సిరాజ్ చక్కగా సరిపోతాడని యాజమాన్యం అనుకుంటున్నది. అందుకే తుది జట్టులో సిరాజ్‌కు చోటు దక్కే అవకాశాలు ఉన్నట్లు టీమ్ ఇండియా వర్గాలు అంటున్నాయి. మరి సిరాజ్ ఈ అవకాశాన్ని ఎలా వినియోగించుకుంటాడో వేచి చూడాలి.