- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
అతిపెద్ద హాకాథాన్‌లో రేపు మోడీ ప్రసంగం
న్యూఢిల్లీ: స్మార్ట్ ఇండియా హాకాథాన్ 2020 గ్రాండ్ ఫినాలేలో ప్రధాని నరేంద్ర మోడీ రేపు ప్రసంగించనున్నారు. శనివారం ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభం కానున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ హాకాథాన్‌లో ఆయన మాట్లాడనున్నట్టు విద్యాశాఖ ప్రకటనలో పేర్కొంది. శనివారం నుంచి సోమవారం వరకు సాగనున్న ఈ కార్యక్రమంలో ప్రభుత్వం, ప్రైవేటు రంగాలు ఎదుర్కొంటున్న సవాళ్లకు విద్యార్థులు పరిష్కారాలను వెతుకుతారని తెలిపింది.
భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లకు డిజిటల్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పరిష్కారాలను గుర్తించడం ఈ హాకాథాన్ ప్రధానొద్దేశ్యం. ఇందులో దాదాపు 10వేల మంది విద్యార్థులు పాల్గొని ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు నేడు ఎదుర్కొంటున్న సుమారు 243 సవాళ్లను పరిష్కరించనున్నారు. ప్రతి సమస్య పరిష్కారానికి రూ. లక్ష ప్రైజ్ మనీ ఉంటుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ మనీలుగా రూ. ఒక లక్ష, రూ. 75వేలు, రూ. 50వేలుగా ఉంటాయి.