పేదలకు మోడీ కిట్లు

by Shyam |
పేదలకు మోడీ కిట్లు
X

దిశ, న్యూస్ బ్యూరో: లాక్‌డౌన్ పొడిగింపుతో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సిద్ధమయ్యారు. ఇప్పటికే 10 వేల నిత్యావసర కిట్లను పంపిణీ చేసిన కిషన్ రెడ్డి.. మరో 10 వేల నిత్యావసరాల కిట్లను పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు ఆయన సతీమణి కావ్య కిషన్ రెడ్డి తెలిపారు. నిత్యావసర కిట్‌లో రైస్- 5 కిలోలు, పప్పు – ఒక కిలో, ఒక లీటర్ నూనె, పసుపు, కారం, చింతపండు, పచ్చడి, నాలుగు మాస్క్‌లు.. మొత్తం 9 రకాల వస్తువులతో కూడిన కిట్లను సిద్ధం చేస్తున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్యాకింగ్ సిబ్బందితో కిట్లను సిద్ధం చేశామని కావ్య కిషన్ రెడ్డి తెలిపారు. ఈ కిట్లను రేపు ( మే 4) మధ్యాహ్నం నగరం నలుమూలలకు ప్రత్యేక వాహనాల ద్వారా పంపిణీ చేయనున్నట్లు ఆమె తెలియజేశారు. ఇప్పటికే నిత్యావసర కిట్లతో పాటు 2 దఫాలుగా 44 టన్నుల నాణ్యమైన తాజా కూరగాయలను పంపిణీ చేయించామని ఆమె వివరించారు. ప్రధానమంత్రి పిలుపు ‘ఫీడ్ ద నీడీ’లో భాగంగా ఈ నిత్యావసరాల కిట్లను సిద్ధం చేస్తున్నట్టు కిషన్ రెడ్డి తెలిపారు.

tags: migrant labour, telangana, lockdown, kishan reddy, bjp, food

Advertisement

Next Story

Most Viewed