- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మోడీ సర్కారు అపూర్వ విజయాలు: అమిత్ షా
by Shamantha N |

X
న్యూఢిల్లీ: ఏడేళ్ల పాలనలో మోడీ ప్రభుత్వం అపూర్వ విజయాలను సాధించిందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. పేదల ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంలో, రైతులు, అణగారినవర్గాలను ప్రధానస్రవంతిలో చేర్చడంలో ప్రధానమంత్రి మోడీ కీలకపాత్ర పోషించారని వివరించారు. నరేంద్ర మోడీ బలమైన నాయకత్వంతో దేశాన్ని పవర్‌ఫుల్‌గా మార్చారని పేర్కొన్నారు. అభివృద్ధి, రక్షణ, ప్రజా సంక్షేమం, సంస్కరణలన్నీ ఏకకాలంలో చేపట్టి ఏకైక ఉదాహరణగా మోడీ ప్రభుత్వం నిలిచిందని ట్వీట్ చేశారు. ప్రజలు మోడీపై ఉంచిన విశ్వాసానికి ఆయన సదా కృతజ్ఞుడై ఉంటారని పేర్కొన్నారు. ఏడేళ్లుగా దేశానికి సేవలందించిన, ప్రజా సంక్షేమానికి పాటుపడిన ప్రధాని మోడీకి కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ అభినందనలు తెలిపారు. ఏడేళ్లు పూర్తి చేసుకున్న రోజును సేవా దివస్‌గా గుర్తించి వేడుకలకు దూరంగా ఉండి సేవలో మునిగారని పేర్కొన్నారు.
Next Story