- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తలుపులు మూసి చేసింది మీరు..
తెలంగాణ విభజన సమయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరుపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించడం లేదని పదేపదేకాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శల నేపథ్యంలో మోడీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. బీజేపీ హయాంలో జార్ఘండ్, చత్తీస్‌గఢ్, జమ్మూకాశ్శీర్ వంటి మూడు రాష్ట్రాలు ఏర్పడ్డాయని అన్నింటిపైన సమగ్రంగా చర్చలు జరిగాకే విభజన చేశామని చెప్పారు. కానీ కాంగ్రెస్ హయాంలో రాజ్యాంగానికి విరుద్ధంగా పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ రాష్ట్రాన్ని విడగొట్టారని, ఆ సమయంలో ఏపీ ప్రజల మనోభావాలను కనీసం పరిగణలోకి తీసుకోలేదని మోడీ విమర్శించారు. చివరకు సీఏఏ చట్టంపై కూడా చర్చ జరిపాకే పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపాయని, కానీ మేమే మీలాగ బలవంతంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టాలు చేయలేదని కాంగ్రెస్ నాయకులపై రాజ్యసభ సాక్షిగా విమర్శలు గుప్పించారు.